Revati Nakshatra: రేవతి నక్షత్రంలో పుట్టినవారు అదృష్టవంతులు, తెలివిగలవారట.. వీరితో స్నేహం ఎలా ఉంటుందంటే..

Revati Nakshatra: హిందూ సంప్రదాయం ప్రకారం.. ఒకప్పుడు పుట్టిన రోజు వేడుకలను జన్మించిన తిథి నక్షత్రాలను బట్టి జరుపుకునేవారు. కాలక్రమంలో అన్నింటిలోనూ మార్పులు వచ్చినట్లు పుట్టినరోజు..

Revati Nakshatra: రేవతి నక్షత్రంలో పుట్టినవారు అదృష్టవంతులు, తెలివిగలవారట.. వీరితో స్నేహం ఎలా ఉంటుందంటే..
Revathi Nakshatram
Follow us

|

Updated on: Sep 27, 2021 | 9:38 AM

Revati Nakshatra: హిందూ సంప్రదాయం ప్రకారం.. ఒకప్పుడు పుట్టిన రోజు వేడుకలను జన్మించిన తిథి నక్షత్రాలను బట్టి జరుపుకునేవారు. కాలక్రమంలో అన్నింటిలోనూ మార్పులు వచ్చినట్లు పుట్టినరోజు జరుపుకునే తేదీల్లో కూడా మార్పులు వచ్చాయి. ఆయితే ఇప్పటికీ మన జాతకం చూడాలంటే.. జన్మ తేదీ.. సమయం, నక్షత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఇక మనిషి నడవడికను జన్మ నక్షత్రం బట్టికూడా అంచనావేస్తారు. జోతిష్యం ప్రకారం 27 నక్షత్రాలు, 12 రాశులు ఉన్నాయి. ఈరోజు 27 నక్షత్రాల్లో ఒకటి.. చివరి నక్షత్రమైన రేవతి నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల వ్యవహార శైలి, చదువు, ప్రవర్తన, తదితర గుణ గణాల గురించి తెలుసుకుందాం..

రేవతి నక్షత్ర అధిపతి బుధుడు.. గణం దేవగణం. అధిదేవత పూషణుడు.. రాశి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. చదువుపై అమితాశక్తిని చూపిస్తారు. నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వం వీరిసొంతం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రశాంతంగా నిదానంగా సమాధానం చెబుతారు. ఎలాంటి సమస్యలు వచ్చినా హాయిగా కూల్ గా ఉంటారు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. అంతేకాదు రేవతి నక్షత్రంలో జన్మించినవారితో స్నేహం సంతోషంగా ఉంటుంది. ఎలాంటి కారణాల వల్ల ఇతరుల పనికి అడ్డంకి కలిగించడానికి మీరు ఇష్టపడరు.. అదేవిధంగా ఇతరుల నుంచి కూడా మీరు దీనినే ఆశిస్తారు.

స్నేహపూర్వకంగా ఉంటారు. వీరు మాట్లాడుతుంటే మరీ మరీ వినాలనిస్తుందట. ఇక వీరు ఎవరిని గుడ్డిగా ఎవరిని నమ్మరు. వీరి ప్రవర్తన కొంచెం మతపూర్వకంగా ఉంటుంది  పురాతన సంస్కృతులు,  చరిత్ర పట్ల మక్కువ చూపిస్తారు. ఖగోళశాస్త్రం,  జ్యోతిష్యశాస్త్రంలో  ఎక్కువ ఈ రాశివారు కనిపిస్తారు. అంతేకాదు  కవిత్వంలో కూడా నైపుణ్యం ఉంటుంది, సంప్రదాయవాదులైనప్పటికీ, పరిశోధనలు చేయడానికి ఇష్టపడతారు.

రేవతి నక్షత్రంలో జన్మించినవారు మంచి చదువులు చదువుతారు. విద్యార్హత చాలా ఎక్కువగా ఉంటుంది. మీ తెలివితేటలు ఆధారంగా మీరు ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తారు. మీకు అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడటంతోపాటుగా, మీరు ఒక స్కాలర్. ఇతరులతో మీ ప్రవర్తన మంచిగా ఉంటుంది  జీవితంలో  ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుంటూ.. ముందుకు సాగడానికి మీరు ప్రయత్నిస్తారు. అంతేకాదు సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తి గా మెలుగుతారు. వీరి జీవితం విలాసవంతంగా సంతోషంగా ఉంటుంది. ఆర్ధికంగానూ మంచి స్టేజ్ లో ఉంటారు.  వీరి వైవాహిక జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది.  కుటుంబంతో పిల్లతో సంతోషంగా గడుపుతారు.  ఈ రాశివారు కళాకారులు,  పెయింటర్,  హిప్నాటిస్ట్, నటులు, సంగీతకారుడు, మెజీషియన్,  ప్రభుత్వం ఉద్యోగాలు , ఉన్నత స్థితిలో ఉద్యోగులు, పోలీస్ విభాగంలో ఎక్కువగా కనిపిస్తారు.

Also Read:

నవరాత్రి మొదటి రోజునుంచి తెరుచుకోనున్న షిరిడీ ఆలయం.. కరోనా నిబంధనలతో ‘మహాసమాధి’ దర్శనానికి అనుమతి