UP Man: ఇదేం భక్తిరా బాబూ.. శివయ్య ప్రసన్నం కోసం తన తలను తానే నరుక్కున్న ఓ యువకుడు.. పరిస్థితి విషమం..
ఒక యువకుడు శివుడి ప్రసన్నం కోసం ఏకంగా తన తలనే నైవేద్యంగా పెట్టాలనుకున్నాడు. తలను నరుక్కునేందుకు ప్రయత్నించి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తి శివుడికి నైవేద్యంగా ట్రీ కట్టర్ మెషీన్‌ను ఉపయోగించి తన తలను తానే నరుక్కునేందుకు ప్రయత్నించడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
పురాణాలలో దేవుళ్లను ప్రసన్నం చేసుకోవానికీ కఠినమైన దీక్ష తపస్సు చేసేవారని కథలు చదువుకున్నాం… వింటూనే ఉన్నాం.. శివయ్య కంట రక్త కన్నీరు చూసిన కన్నప్ప తన కళ్లను భక్తితో సమర్పించి భక్త కన్నప్ప గురించి అందరికీ తెలిసిందే. అయితే ఒక యువకుడు శివుడి ప్రసన్నం కోసం ఏకంగా తన తలనే నైవేద్యంగా పెట్టాలనుకున్నాడు. తలను నరుక్కునేందుకు ప్రయత్నించి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తి శివుడికి నైవేద్యంగా ట్రీ కట్టర్ మెషీన్‌ను ఉపయోగించి తన తలను తానే నరుక్కునేందుకు ప్రయత్నించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. దీపక్ కుష్వాహ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
దీపక్ తండ్రి పల్తూరామ్ కుష్వాహా మాట్లాడుతూ తన కొడుకు పరమశివుడి భక్తుడని.. ఎంతో ఇష్టంగా దైవాన్ని కొలుస్తాడని చెప్పాడు. అంతేకాదు గత కొన్ని నెలలుగా.. దీపక్ తన శిరస్సును బలి ఇచ్చి .. తద్వారా శివుడిని ప్రసన్నం చేసుకోవాలని కోరికను వ్యక్తం చేశాడని తెలిపాడు. ఒక లెటర్ లో శివునికి ప్రార్థనలు.. తన అర్పణ గురించి కూడా వ్రాసాడు. “ఇలా చేయడం పిచ్చి అని తాను కొడుకుతో ఎప్పుడూ చెప్పేవాడిని అని.. అయితే ఒక యాగం చేయాలని ఒక నెల నుండి పట్టుబడుతున్నాడు” అని దీపక్ తండ్రి చెప్పారు.
ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు.. దీపక్ తమ ప్రాంతంలోని శివాలయాన్ని సందర్శించి “జై భోలేనాథ్” అని నినాదాలు చేస్తూ.. బలిపీఠం ముందు చెట్టు కోసే యంత్రాన్ని ఉపయోగించి తన మెడను కోసుకున్నాడు. అతని కేకలు విన్న గ్రామస్థులు ఆలయానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న దీపక్‌ను గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీపక్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..