Atiq Ahmed: అతిక్, అష్రఫ్‌ల హత్యపై పోలీసులకు ఎదురవుతున్న 5 కీలకమైన ప్రశ్నలు
శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో గ్యాంగ్‌స్టర్స్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను ముగ్గురు దుండగులు పాత్రికేయుల వేషంలో వచ్చి పోలీసుల మందే కాల్చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో గ్యాంగ్‌స్టర్స్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను ముగ్గురు దుండగులు పాత్రికేయుల వేషంలో వచ్చి పోలీసుల మందే కాల్చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులకు కొన్ని కఠినమైన ప్రశ్నలు సవాలుగా మారింది. ముఖ్యంగా ఐదు ప్రశ్నలను యూపీ పోలీసులు ఎదుర్కొంటున్నారు.
1. ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ అనే వ్యక్తిని హత్యచేసిన కేసులో అతిక్, అష్రఫ్ లను వైద్య పరీక్షల కోసం శనివారం రాత్రి తీసుకొచ్చారు. అయితే రాత్రి పూట వాళ్లని వైద్య పరీక్షలకు తీసుకురావాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.
2. అతిక్, అష్రఫ్ లను ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చిన పోలీసు వాహనాన్ని ఆ ఆసుపత్రి గేటు బయటే పార్కు చేశారు. అక్కడి నుంచి అతిక్, అష్రఫ్ లను నడిపించుకుంటూ తీసుకొచ్చారు. అలాంటి పెద్ద గ్యాంగ్‌స్టర్లను బయటి నుంచి నడిపించి తీసుకురావల్సిన అవసరం ఎందుకు. పోలీసులు ఎందుకు నేరుగా ఆసుపత్రి భవనం దగ్గరి వరకు తీసుకెళ్లలేదు.




3. అతిక్, అష్రఫ్ లను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు వారి వెంట సుమారు 20 మంది పోలీసులు ఉన్నారు. అంత మంది పోలీసులు ఉన్నప్పటికీ ఆ ముగ్గరు దుండగుల నుంచి రక్షించండంలో ఎలా విఫలమయ్యారు. ఆ దుండగులు అతిక్ ను 9 సార్లు కాల్చినట్లు, అలాగే అష్రఫ్ శరీరంలో 5 బుల్లెట్లు దింపినట్లు శవ పరీక్షలో నివేదికలో తేలింది.
4. ఆ దుండగులు అతిక్, అష్రఫ్ లపై 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. కానీ పోలీసులు ఒక్క బుల్లెట్ ను కూడా పేల్చలేదు. సంకెళ్లతో ఉన్న అతిక్, అష్రఫ్ లు గన్ షాట్స్ తగలగానే అక్కడే పడిపోయారు. నిందితులు వాళ్లకి దగ్గరగా ఉండి కాల్పులు జరపే దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం తుపాకిని వాడలేదు.
5. నిందితులు మీడియా వ్యక్తులలాగా అక్కడికి వచ్చారు. అయితే అలాంటి గ్యాంగ్‌స్టర్ల దగ్గరికి వచ్చేముందు పోలీసులు ఆ మీడియా వాళ్లని ఎందుకు తనిఖీ చేయలేకపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




