Araku Coffee: పార్లమెంట్‌లో మన అరకు కాఫీ ఘుమఘుమలు.. స్టాల్ ప్రారంభం..
ఇకపై పార్లమెంట్‌లో ఎంపీలంతా ఇకపై అరకు కాఫీని టేస్ట్ చెయ్యొచ్చు.. ఇందుకోసం సోమవారం క్యాంటీన్ సంగం-1లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితోపాటు కూటమి ఎంపీలంతా అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇకపై పార్లమెంట్‌లో ఎంపీలంతా ఇకపై అరకు కాఫీని టేస్ట్ చెయ్యొచ్చు.. ఇందుకోసం సోమవారం క్యాంటీన్ సంగం-1లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితోపాటు కూటమి ఎంపీలంతా అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వడంతో… పార్లమెంట్ ఆవరణలో ఇవాళ్టి నుంచి అరకు కాఫీ స్టాల్ అందుబాటులోకి వచ్చింది. 2 కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు.. దీనికి సంబంధించి ఇవ్వాల్టి నుంచి కాఫీ స్టాల్స్ అందుబాటులోకి రానున్నాయి..
కాఫీ స్టాల్స్ ప్రారంభం కోసం రెండ్రోజుల ముందే గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా అక్కడే ఉన్నారు. అరకు కాఫీకి ఈ స్థాయి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏపీ గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతున్నందుకు గర్వంగా కూడా ఉందని తెలిపారు.
వీడియో చూడండి..
పార్లమెంట్ లో మన అరకు కాఫీ స్టాళ్ళ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముందుగా లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాను కలిసి మన గిరిజన ఉత్పత్తులు, అరకు కాఫీని వారికి అందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..