India Roads: అమెరికాలో అందాల రోడ్లులా మన రహదారులు ఎప్పుడు మారతాయి? కేంద్రమంత్రి సమాధానం ఇదీ

అమెరికాలో రహదారులు చాలా బాగుంటాయని అందరూ అంటుంటారు. అనడమే కాదు.. అమెరికా వెళ్లని చాలామంది కూడా సినిమాల్లో అమెరికా రోడ్లు ఎలా ఉంటాయో చూస్తూ ఉంటారు. అందంగా మెరిసిపోతూ ఉంటాయి అక్కడి రోడ్లు.. దీంతో ఎంతో వేగంగా..

India Roads: అమెరికాలో అందాల రోడ్లులా మన రహదారులు ఎప్పుడు మారతాయి? కేంద్రమంత్రి సమాధానం ఇదీ
Roads
Follow us

|

Updated on: Dec 18, 2022 | 7:00 AM

అమెరికాలో రహదారులు చాలా బాగుంటాయని అందరూ అంటుంటారు. అనడమే కాదు.. అమెరికా వెళ్లని చాలామంది కూడా సినిమాల్లో అమెరికా రోడ్లు ఎలా ఉంటాయో చూస్తూ ఉంటారు. అందంగా మెరిసిపోతూ ఉంటాయి అక్కడి రోడ్లు.. దీంతో ఎంతో వేగంగా వాహనాలు ఈ రహదారులపై పరిగెడుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో దేశంలోని కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ వేలు, జాతీయ రహదారులు కూడా ఎంతో నాణ్యతతో మెరుస్తూ కనిపిస్తున్నాయి. కానీ కొన్ని రహదారులపై ప్రయాణం చేస్తే మాత్రం ఇంత నరకమేంటిరా బాబు అనిపిస్తుంది. అలా అని రోడ్లన్ని అలా ఉండవు. కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర, జిల్లా రహదారులు కొంత అధ్వానంగా ఉంటుంటాయి. చాలామంది అమెరికాలోలా మన రోడ్లు ఎప్పుడు మారతాయనే అనుమానం రావచ్చు. దీనికి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. 2024 చివరి నాటికి దేశంలో రహదారి మౌలిక సదుపాయాలు అమెరికా ప్రమాణాలకు సమానంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో కేంద్రమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో రహదారుల నిర్మాణంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు.

లాజిస్టిక్స్ ఖర్చ గురించి మాట్లాడుతూ.. 2024 చివరి నాటికి దీనిని 9 శాతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రస్తుతం 16 శాతంగా ఉందని దీనిని సింగిల్‌ డిజిట్‌కు తీసుకువెళ్తామన్నారు. ప్రత్యామ్నాయాలను అనుసరించడం ద్వారా నిర్మాణ పనులలో స్టీల్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. నిర్మాణ పరిశ్‌రమల గురించి మంత్రి మాట్లాడుతూ.. నిర్మాణల నాణ్యతను మెరుగుపరచడంపై తాము దృష్టి సారిస్తామని తెలిపారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కాలుష్యానికి సిమెంట్‌, స్టీల్‌ కారణమని, అందుకే వాటికి ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నట్లు తెలిపారు.

గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తుకు ఇంధనమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇంధన ఎగుమతిదారుగా భారత్‌ తనను తాను తీర్చిదిద్దుకోవడానికి అద్భుతమైన స్థితిలో ఉందన్నారు. భవిష్యత్తులో విమానయానం, రైల్వే, రోడ్డు రవాణా, రసాయన పరిశ్రమలలో గ్రీన్ హైడ్రోజన్‌ను వాడటంపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..