ఒలంపిక్స్ లో మెరిసిన భారతీయ తేజాలు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఏం చేశారంటే ..?

ఒలంపిక్స్ లో భారతీయ అథ్లెట్ల అత్యుత్తమ ప్రతిభకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆనందం పట్టలేకపోయారు. ఇటీవలి వరకు క్రీడా మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించిన ఆయన..

ఒలంపిక్స్ లో మెరిసిన భారతీయ తేజాలు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఏం చేశారంటే ..?
Law Minister Kiren Rijiju
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 08, 2021 | 9:56 AM

ఒలంపిక్స్ లో భారతీయ అథ్లెట్ల అత్యుత్తమ ప్రతిభకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆనందం పట్టలేకపోయారు. ఇటీవలి వరకు క్రీడా మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించిన ఆయన.. చాంపేన్ ని స్ప్రే చేస్తూ తన ట్విటర్ లో వీడియోను షేర్ చేశారు. భారత ఒలంపిక్ అథ్లెట్లకు ఛీర్స్ అంటూ ఛాంపేన్ ని విరజిమ్మారు. ఇది ఇండియా సెలబ్రేట్ చేసుకునే సమయం.. టోక్యో ఒలంపిక్స్ లో మన దేశం అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది ..నీరజ్ చోప్రా, మీరా బాయి చాను, రవి కుమార్ దాహియా, పీ.వి.సింధు, బజరంగ్ పునియా, లవ్ లీనా, ఇంకా..ది గ్రేట్ ఇండియన్ హాకీ టీమ్ అంటూ పేరు పేరునా ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించినందుకు ఇండియా ఎంతో గర్విస్తోందన్నారు. ఒలంపిక్స్ లో ఇండియా ఇప్పటివరకు ఏడు పతకాలు సాధించింది. వీటిలో రెండు రజతం, నాలుగు కాంస్యం, ఓ గోల్డ్ మెడల్ ఉన్నాయి. మొదట కిరణ్ రిజిజు..లెజెండరీ స్ప్రింటర్ దివంగత మిల్కా సింగ్ ని కూడా స్మరించుకున్నారు.

అథ్లెట్స్ లో ఇండియా బంగారు పతకాన్ని సాధించాలన్న మిల్కా సింగ్ కోర్కె నెరవేరిందన్నారు. ఇది చరిత్రాత్మక విజయం అని అభివర్ణించారు. ఇక నీరజ్ చోప్రాకు హర్యానా ప్రభుత్వం 6 కోట్ల నజరానాను ప్రకటించింది. రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ ప్రముఖులంతా అతడ్ని అభినందనలతో ముంచెత్తారు. ఒలంపిక్స్ లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన చోప్రా అత్యుత్తమ అథ్లెట్ అని తమ తమ ట్విటర్లల్లో పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Kiara Advani: చరణ్ తో నటించాలంటే… కియారా డిమాండ్.. ఎంత అడిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..వీడియో

4లక్షల మద్యం బాటిల్ మిస్..!! ఆచూకీ కోసం అమెరికా బిజీ..!! వీడియో