ఢిల్లీ ఎయిర్ పోర్టులో షూటర్ మను భాకర్ కు అవమానం, కేంద్ర మంత్రి జోక్యం, ‘కథ సుఖాంతం’ !
ఇండియన్ ఒలింపియన్, షూటర్ మను భాకర్ కు ఢిల్లీ విమానాశ్రయంలో అవమానం జరిగింది. భోపాల్ లో తన శిక్షణ కోసం ఈమె రెండు గన్స్, తూటాలు తీసుకువెళ్తూ విమానాశ్రయానికి చేరుకోగా..
ఇండియన్ ఒలింపియన్, షూటర్ మను భాకర్ కు ఢిల్లీ విమానాశ్రయంలో అవమానం జరిగింది. భోపాల్ లో తన శిక్షణ కోసం ఈమె రెండు గన్స్, తూటాలు తీసుకువెళ్తూ విమానాశ్రయానికి చేరుకోగా..10 వేలరూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో విమానం ఎక్కనివ్వబోమని ఎయిరిండియా అధికారులు హెచ్ఛరించారు. మధ్యప్రదేశ్ షూటింగ్ అకాడమీలో ట్రెయినింగ్ పొందేందుకు తాను వెళ్తున్నానని, తన వద్ద అనుమతి పత్రాలు, పౌర విమాన యాన శాఖ ఇచ్చిన పర్మిట్ కూడా ఉందని చెప్పినప్పటికీ.. వారు అనుమతించలేదని ఆమె ట్వీట్ చేసింది. పైగా ఎయిరిండియా ఇన్-ఛార్జ్ మనోజ్ గుప్తా, ఇతర స్టాఫ్ తనను వేధించారని, తన మొబైల్ ఫోన్ లాక్కుని అందులో తన తల్లి తీసిన క్లిప్స్ ను డిలీట్ చేశారని ఆమె ఆరోపించింది. దీంతో తనకు సాయం చేయాల్సిందిగా మను భాకర్ కేంద్ర మంత్రులు కిరణ్ రిజ్జు, హర్ దీప్ సింగ్ పురిలను ఉద్దేశించి ట్వీట్ చేసింది. తనను మనోజ్ గుప్తా ఓ నేరస్థురాలిగా పరిగణించి అసభ్యంగా మాట్లాడినట్టు ఆమె పేర్కొంది. చివరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు జోక్యంతో విమానాశ్రయ అధికారులు..విమానం ఎక్కేందుకు ఆమెను అనుమతించారు.
తనకు సాయపడినందుకు ఈమె కిరణ్ రిజ్జుకు కృతజ్ఞతలు తెలపగా..ఆయన.. నువ్వు ఇండియాకే గర్వ కారణమని తిరిగి రిప్లై ఇచ్చారు. ఎయిరిండియాలో మనోజ్ గుప్తా వంటి అధికారులు ఉన్నందుకు మన దేశ ప్రతిష్ట దెబ్బ తింటుందని మను భాకర్ ట్వీట్ చేసింది.
మరిన్ని చదవండి ఇక్కడ :
ఉత్తరాఖండ్ ఉత్పాతం, రంగు మారిన అలకానంద నది నీరు, మరికొన్ని రోజుల పాటు సేమ్ సీన్ !
పైసల్లేక కటకట ! వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో నిధుల కొరత ! ఏం చేద్దాం ?