కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి నాపై దాడి చేయబోయారు.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్

కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి తనపై దాడి చేయబోయారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్ ఆరోపించారు. తనను ఆయన దుర్భాష లాడరాని, బెదిరించారని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి నాపై దాడి చేయబోయారు.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్
Union Minister Hardeep Puri About To Assault On Me Says Tmc Mp Santanu Sen
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 22, 2021 | 9:15 PM

కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి తనపై దాడి చేయబోయారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్ ఆరోపించారు. తనను ఆయన దుర్భాష లాడరాని, బెదిరించారని ఆయన అన్నారు. రాజ్యసభ వాయిదా పడిన అనంతరం తాను బయటకు వస్తుండగా ఆయన పిలిచారని, తను దగ్గరికి వెళ్ళగానే దూషిస్తూ తనపైకి దాడికి రాబోయారని ఆయన చెప్పారు. కొంతమంది కూడా తనను ఘెరావ్ చేయడానికి యత్నించగా తన సహచరులు వచ్చి తనను రక్షించారని సేన్ చెప్పారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అన్నారు. కేంద్ర మంత్రి ప్రవర్తనపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ కి తామంతా కలిసి ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.. మొదట రాజ్య సభలో పెగాసస్ వివాదంపై ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగించడానికి లేవబోగా ఆయన చేతి నుంచి సేన్ ఆ పేపర్లను లాక్కుని చించి పోగులు పెట్టి వాటిని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ దిశగా విసిరి వేశారు. సభలో ఈ ఘటన పెను దుమారాన్ని సృష్టించింది.

ఈ నేపథ్యంలో సేన్ పై సభా హక్కుల తీర్మానాన్ని ప్రతిపాదించాలని. అలాగే సభ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. బహుశా శుక్రవారం ఇందుకు ప్రభుత్వం యత్నించవచ్చునని తెలుస్తోంది. సభలో సభ్యుల ప్రవర్తన హుందాగా ఉండాలని, సభా కార్యకలాపాలు సజావుగా జరగనివ్వాలని ప్రధాని మోదీ పదేపదే విపక్ష సభ్యులను కోరిన సంగతి విదితమే. అయితే పెగాసస్ అంశంపై మూడు రోజులుగా పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యులు రభసను సృష్టిస్తున్నారని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Sanskrit In Village: వారు అందులోనే మునిగి తేలుతుంటారు.. ఆ గ్రామంలో సంస్కృత పరిమళం.. చదువులో అందరూ టాపర్స్..

Hyderabad Red Alert : హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ : వర్షాలతో ఎమర్జెన్సీ, అత్యవసర బృందాలు అప్రమత్తం : మేయర్ విజయలక్ష్మి