AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవగాహనా రాహిత్యంతో మాట్లాడకండి.. రాహుల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీకి అవగాహన లేదన్న కిషన్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ పవర్ పరిస్థితి గురించి ఆయనకు తెలియదన్నారు. ప్రస్తుతుం 18,000 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి జమ్మూ కాశ్మీర్‌కు అద్భుతమైన సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

అవగాహనా రాహిత్యంతో మాట్లాడకండి.. రాహుల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి
Rahul Gandhi G Kishan Reddy
Balaraju Goud
|

Updated on: Sep 11, 2024 | 4:29 PM

Share

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీకి అవగాహన లేదన్న కిషన్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ పవర్ పరిస్థితి గురించి ఆయనకు తెలియదన్నారు. ప్రస్తుతుం 18,000 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి జమ్మూ కాశ్మీర్‌కు అద్భుతమైన సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ అతని ముందున్న 3 తరాల ప్రధానులకు ఈ విషయం తెలుసన్నారు.

స్వాతంత్య్రానంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం 1,197 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే అందించిందన్నారు. మోదీ ప్రభుత్వం 2025-26 నాటికి మరో 3,014 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 9,500 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ విద్యుత్ లోటు 2018-19లో 17.8% నుండి 2023-24 సంవత్సరంలో 7.5%కి తగ్గించడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

రాహుల్ గాంధీ ఎన్నికల టూరిస్ట్‌గా అభివర్ణించిన కేంద్ర మంత్రి, ఎన్నికల సమయంలో అతను ప్రచారం చేస్తాడు, సందర్భం, వాస్తవాలు లేకుండా చెత్తను చిమ్ముతాడు. ఆపై వెళ్లిపోతాడు. అ తర్వాత జరిగే పరిణామాలకు స్థానికనేతలు తలలు పట్టుకోవలసి వస్తుందన్నారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఓడినంత మాత్రాన దేశంలో ప్రజాస్వామ్యం లేదని.. దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా.. ఇంగితం లేకుండా రాహుల్ మాట్లాడటం తగదని కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత్ ప్రతిష్టను దిగజార్చడం ద్వారా మరోసారి తన దురుసు ప్రవర్తనను ప్రదర్శించారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులతో సమావేశమవుతున్న.. రాహుల్‌ వ్యవహారశైలి సరికాదన్నారు.

అంత ముందు, జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విద్యుత్‌ను అందజేస్తుండగా, జమ్మూ కాశ్మీర్ నివాసితులు దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గత దశాబ్ద కాలంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సామర్థ్యాన్ని పెంచిదన్నారు. 2025-26 నాటికి మరో 3,014 మెగావాట్ల సామర్థ్యం పెరగనున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2026 నాటికి, జమ్మూ కాశ్మీర్‌లో ఏటా మొత్తం 10,614 మిలియన్ యూనిట్ల శక్తి ఉత్పత్తి చేయడం జరుగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పూర్తిగా అవగాహన లేమితో అబద్ధాలు, అర్ధసత్యాలు చెబుతూనే ఉన్నారు. అధికారంపై అతని జ్ఞానం కూడా ఇదే విధమైన అవగాహనా రాహిత్యాన్ని ప్రతిబింబిస్తుందని కిషన్ విరుచుకుపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..