AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSS: ఆర్‌ఎస్‌ఎస్ దసరా వేడుకల్లో సింగర్ శంకర్‌ మహదేవన్‌.. గానామృతానికి ఫిదా అయిన ప్రముఖులు

ఈ కార్యక్రమానికి వీరితోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్‌ మహదేవన్ తన గాత్రంతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మహదేవన్‌ గానామృతానికి ఫిదా అయ్యారు. దేశ గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన పాట కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత...

RSS: ఆర్‌ఎస్‌ఎస్ దసరా వేడుకల్లో సింగర్ శంకర్‌ మహదేవన్‌.. గానామృతానికి ఫిదా అయిన ప్రముఖులు
Dharmendra Pradhan, Shankar mahadevan
Narender Vaitla
|

Updated on: Oct 25, 2023 | 7:03 AM

Share

మంగళవారం విజయదశమని సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) దసరా ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగానే సంఘ్‌ సభ్యులు ‘పథ సంచాలన్‌’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పాల్గొనగా, ముఖ్య అతిథిగా సింగర్‌ శంకర్ మహదేవన్‌ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి వీరితోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్‌ మహదేవన్ తన గాత్రంతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మహదేవన్‌ గానామృతానికి ఫిదా అయ్యారు. దేశ గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన పాట కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకుంది. కార్యక్రమం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మహదేవన్‌ దేశ ప్రజలందరినీ విజయదశమని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా గౌరవంగా ఉందన్న శంకర్‌ మహదేవన్‌.. మోహన్‌ భగవత్‌తో పాటు, ఆర్‌ఎస్ఎస్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందన..

ఇక శంకర్ మహదేవన్‌ పాడిన పాటను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ‘నేను జీవించి ఉన్నా లేకపోయినా భారతదేశం నిలిచే ఉండాలి. ఈ పవిత్ర భావనతో ఈరోజు భారతదేశంలోని ప్రతీ పౌరుడు, ముఖ్యంగా మన అమృత్‌ తరం, అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పాన్ని నెరవేర్చాలనే కర్తవ్యంతో ముందుకు సాగాలి. జాతీయ విద్యా విధానం 2020 భారతీయత భావాన్ని బలోపేతం చేయడానికి, వారసత్వ గురించి గర్వపడడానికి ఒక మాధ్యమం. ఇక భారతీయత విలువలను, భారతదేశ సంస్కృతిని తన సంగీతం ద్వారా ప్రదర్శించినందుకు పద్మశ్రీ శంకర్‌ మహదేవ్‌కి నా ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు.

శంకర్ మహదేవన్ ట్వీట్..

ఇక కేంద్ర మంత్రి చేసిన ట్వీట్‌కు స్పందించారు గాయకుడు శంకర్‌ మహదేవన్‌. ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘మీ అభినందనలకు, ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు సార్‌. మీ ప్రేమ, అభిందనలకు కృతజ్ఞతలు అంటూ స్పందించారు. ఇదిలా ఉంటే ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్న మోహన్‌ భగవత్‌.. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని పిలుపునిచ్చారు. ఇక ‘పథ సంచాలన్’ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు, సంఘ్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..