Gold Purity: మీరు కొన్న గోల్డ్‌ స్వచ్ఛమైందేనా..? ఇలా తెలుసుకోండి..!

Gold Purity: మీరు కొన్న గోల్డ్‌ స్వచ్ఛమైందేనా..? ఇలా తెలుసుకోండి..!

Anil kumar poka

|

Updated on: Oct 24, 2023 | 9:27 PM

దసరా, దీపావళికి కొత్త వస్తువులు కొనే సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. అయితే కేవలం ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాలు మాత్రమే కాకుండా కొందరు బంగారం కూడా కొనుగోలు చేస్తుంటారు. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసలు మనం కొనుగోలు చేస్తున్న బంగారం స్వచ్ఛమైందేనా అనే సందేహం రావడం సహజం. అయితే కేంద్ర ప్రభుత్వం హాల్‌ మార్క్‌ను తప్పనిసరి చేసిన తర్వాత బంగారం నాణ్యతపై కొనుగోలు దారులకు అవగాహన పెరుగుతోంది.

దసరా, దీపావళికి కొత్త వస్తువులు కొనే సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. అయితే కేవలం ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాలు మాత్రమే కాకుండా కొందరు బంగారం కూడా కొనుగోలు చేస్తుంటారు. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసలు మనం కొనుగోలు చేస్తున్న బంగారం స్వచ్ఛమైందేనా అనే సందేహం రావడం సహజం. అయితే కేంద్ర ప్రభుత్వం హాల్‌ మార్క్‌ను తప్పనిసరి చేసిన తర్వాత బంగారం నాణ్యతపై కొనుగోలు దారులకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ బంగారం నాణ్యతను తెలుసుకోవడానికి మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఐఎస్ కేర్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌ ద్వారా బంగారం క్వాలిటీని తెలుసుకోవచ్చు. ఇటీవల బంగారు ఆభరణాలపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రతీ ఒక్క ఆభరణానికి ప్రత్యేక హెచ్‌యూఐడీ నెంబర్‌ కేటాయిస్తారు. మీరు కొనుగోలు చేసిన ఆభరణాలపై హెచ్‌యూఐడీ ఉందో లేదో చూసుకొని ఈ కోడ్‌ ఉన్న ఆభరణాలనే కొనుగోలు చేయడం మంచిది. ఈ కోడ్‌ ఆధారంగానే గోల్డ్‌ క్వాలిటీని తెలుసుకోవచ్చు. ఇక గోల్డ్‌ స్వచ్ఛతను తెలుసుకోవడానికి ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ‘బీఐఎస్‌ కేర్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం మీ పేరు, ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, ఓటీపీతో యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలి. అనంతరం యాప్‌ ఓపెన్ కాగానే వెరిఫై హెచ్‌యూఐడీ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మీరు కొనుగోలు చేసే ఆభరణంపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ నొక్కాలి. వెంటనే మీ ఆభరణానికి సంబంధించిన హాల్‌మార్క్‌ చేయించిన షాప్‌, హాల్‌ మార్క్‌ వేసిన కేంద్రం, బంగారం స్వచ్ఛత వంటి వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..