Amit Shah Meet: ఈశాన్య సరిహద్దు భద్రతపై కేంద్ర ఫోకస్.. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా భేటీ..!

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంతం నెలకొల్పేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Amit Shah Meet: ఈశాన్య సరిహద్దు భద్రతపై కేంద్ర ఫోకస్.. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా భేటీ..!
Amith-Shah
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 24, 2021 | 2:10 PM

Amit Shah Meeting with Chief Ministers: ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అయా రాష్ట్రాల్లో ప్రశాంతం నెలకొల్పేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా పాల్గొంటున్నారు. సరిహద్దు సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. మేఘాలయ వేదికగా ఈ సమావేశం జరగనుంది.

అసోం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాంతో అసోం సరిహద్దు సమస్యలను ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల క్రితం ఇదే సమస్యపై అసోంలో అల్లర్లు కూడా జరిగాయి. ఈ సమస్యను కూడా అమిత్‌షా సంబంధిత ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కేవలం ముఖ్యమంత్రులే కాకుండా, వివిధ పౌర సమాజపు నేతలతో కూడా అమిత్‌షా భేటీ కానున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.

Read Also… 

Vehicle Insurance: అద్దె వాహనాల ఇన్సూరెన్స్‌ విషయంలో సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు..!