AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amith Shah: 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్ములో తొలిసారి అమిత్‎షా పర్యటన.. శ్రీనగర్‎ అభివృద్ధిపై సమీక్ష.

కేంద్రం హోం మంత్రి అమిత్‎షా జమ్ముకశ్మీర్‎లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత హోంమంత్రి మొదటి సారిగా అక్కడ ప్రర్యటిస్తున్నారు...

Amith Shah: 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్ములో తొలిసారి అమిత్‎షా పర్యటన.. శ్రీనగర్‎ అభివృద్ధిపై సమీక్ష.
Amith
Srinivas Chekkilla
|

Updated on: Oct 23, 2021 | 3:22 PM

Share

కేంద్రం హోం మంత్రి అమిత్‎షా జమ్ముకశ్మీర్‎లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత హోంమంత్రి మొదటి సారిగా అక్కడ ప్రర్యటిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు కల్పిస్తున్న ప్రత్యేక హోదాను 2019 ఆగస్టు 5న రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం లడఖ్, జమ్ము అండ్ కశ్మీర్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. శ్రీనగర్ నుంచి షార్జాకు తొలి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం అవుతున్న వేళ అమిత్ షా.. కశ్మీర్‌ లోయలో పర్యటిస్తున్నారు. అమిత్‎షా భద్రత, శ్రీనగర్ అభివృద్ధిపై సమీక్షంచనున్నారు. అనంతరం పార్టీ ర్యాలీలో పాల్గొనున్నారు. 26 మంది ఖైదీలను జమ్మూకాశ్మీర్ జైలు నుంచి ఆగ్ర సెంట్రల్ జైలుకు తరలించారు. హోం మంత్రి పర్యటనకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మధ్య కాలంలో జమ్ములో ఇతర ప్రాంతాల వారిని హత్య చేస్తున్నారు. అమాయక పౌరులను టార్గెట్ చేస్తున్న ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా అక్కడ పర్యటనకు వెళ్లడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే షేరీ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(SKICC)కి వెళ్లే అన్ని మార్గాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అమిత్ షా ఎస్‌కేఐసీసీ‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో దాదాపు 50 కంపెనీల అదనపు పారామిలిటరీ బలగాలు కశ్మీర్ లోయలో పహారా కాస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

శ్రీనగర్‌తో పాటు కశ్మీర్ లోయలోని పలుచోట్ల సీఆర్పీఎఫ్ దళాల బంకర్లు ఏర్పాటు చేశారు. కశ్మీర్ లోయలోని పలు రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఇటీవల స్థానికేతర వలస కార్మికులు హత్యకు గురైనన ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

కశ్మీర్ లోయలోని ప్రధాన మార్గాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఉగ్రవాదుల హింసాత్మక కార్యక్రమాల కారణంగానే వాహనాలను సీజ్ చేయడం, మొబైల్ ఇంటర్నెట్ సేవలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. దీనికి కేంద్ర హోం అమిత్ షా పర్యటనతో సంబంధం లేదంటూ ఆయన ట్వీట్ చేశారు.

Read Also.. Hajj 2022: కేంద్రం కీలక నిర్ణయం.. వారికి మాత్రమే హజ్ యాత్రకు పర్మిషన్.. పూర్తి వివరాలు..