NV Ramana: కోర్టుల్లో మౌలిక వసతులు కల్పనకు కేంద్ర న్యాయశాఖ చొరవ చూపాలి

న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కల్పనకు కేంద్ర న్యాయశాఖ మంత్రి చొరవ చూపాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలిపారు. అదేవిధంగా నేషనల్‌

NV Ramana: కోర్టుల్లో మౌలిక వసతులు కల్పనకు కేంద్ర న్యాయశాఖ చొరవ చూపాలి
Follow us

|

Updated on: Oct 23, 2021 | 4:27 PM

న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కల్పనకు కేంద్ర న్యాయశాఖ మంత్రి చొరవ చూపాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలిపారు. అదేవిధంగా నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ప్రతిపాదనకు సంబంధించిన బిల్‌ను పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఆయన కిరణ్‌ రిజిజును కోరారు. ఔరంగాబాద్‌ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఎన్వీరమణతో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీజేఐ దేశంలోని పలు న్యాయస్థానాల్లో కనీస వసతులు లేవన్నారు. చాలా కోర్టులు శిథిలావస్థలోనే పనిచేస్తున్నాయని.. అందువల్లే బాధితులకు న్యాయం అందడంలో ఆలస్యమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అక్కడ మహిళలకు టాయిలెట్లు కూడా లేవు! ‘దేశంలోని చాలా కోర్టులు శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే పనిచేస్తున్నాయి. దీని వల్ల న్యాయమూర్తులు సమర్థంగా పనిచేయలేకపోతున్నారు.  ఫలితంగా బాధితులకు సత్వర న్యాయం అందడం లేదు. దేశంలోని మొత్తం న్యాయస్థానాల్లో కేవలం 5 శాతం కోర్టుల్లోనే ప్రాథమిక చికిత్సా సదుపాయం ఉంది. 26 శాతం కోర్టుల్లో మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవు. 16 శాతం కోర్టుల్లో పురుషులకు కూడా టాయిలెట్స్‌లేని పరిస్థితి. 50 శాతం న్యాయస్థానాల్లో లైబ్రరీలు లేవు. ఇంకా 46 శాతం వాటిల్లో కనీసం తాగునీటి సౌకర్యం లేదు. న్యాయస్థానాల్లో మెరుగైన వసతుల కల్పనకు కేంద్ర న్యాయశాఖ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ప్రతిపాదనకు సంబంధించిన బిల్‌ను రాబోయే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేలా కేంద్ర న్యాయ శాఖ మంత్రి చొరవ చూపాలని కోరుతున్నాను ‘ అని సీజేఐ చెప్పుకొచ్చారు. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనపై ఎన్వీ రమణ ఇలా మాట్లాడడం ఇది రెండోసారి. గతంలో కూడా ఓ కార్యక్రమంలో ఆయన ఇలాగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read:

Amith Shah: 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్ములో తొలిసారి అమిత్‎షా పర్యటన.. శ్రీనగర్‎ అభివృద్ధిపై సమీక్ష.

Electric Scooters: మీరు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటున్నారా..? ఏ స్కూటర్‌కు ఎలాంటి ఫీచర్స్‌, వేగం, ధర తెలుసుకోండి

Crime News: దారుణం.. పెళ్లైన నెలకే భార్యను అమ్మి స్మార్ట్‌ఫోన్ కొన్నాడు.. వివరాలు తెలిస్తే షాకే..

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు