AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఏఏపై మరింత దూకుడు.. రేపు మోదీ నిర్ణయం

పౌరసత్వ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ శుక్రవారం సాయంత్రం భేటీ కాబోతోంది. సీఏఏకు వ్యతిరేకంగా కొన్ని పార్టీలు, అనుకూలంగా బీజేపీ, దాని అనుబంధ సంఘాలు దేశవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలను కొనసాగిస్తున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుండడం అత్యంత కీలకమని ఢిల్లీ వర్గాలంటున్నాయి. సీఏఏతోపాటు ఎన్నార్సీ, ఎన్పీఆర్ అంశాలు దేశవ్యాప్తంగా రెండు రకాల చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు.. చివరికి కొన్ని […]

సీఏఏపై మరింత దూకుడు.. రేపు మోదీ నిర్ణయం
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 16, 2020 | 12:39 PM

Share

పౌరసత్వ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ శుక్రవారం సాయంత్రం భేటీ కాబోతోంది. సీఏఏకు వ్యతిరేకంగా కొన్ని పార్టీలు, అనుకూలంగా బీజేపీ, దాని అనుబంధ సంఘాలు దేశవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలను కొనసాగిస్తున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుండడం అత్యంత కీలకమని ఢిల్లీ వర్గాలంటున్నాయి.

సీఏఏతోపాటు ఎన్నార్సీ, ఎన్పీఆర్ అంశాలు దేశవ్యాప్తంగా రెండు రకాల చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు.. చివరికి కొన్ని ఎన్డీయే పార్టీలు కూడా సీఏఏ అమలును వ్యతిరేకిస్తుండడం మోదీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. సీఏఏ చట్ట సవరణ ముస్లింలకు వ్యతిరేకమని కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారికి కూడా భారత పౌరసత్వం ఇవ్వాలన్న డిమాండ్‌ను పరోక్షంగా వినిపిస్తున్నాయి. ఆ మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులకు భారత పౌరసత్వం ఇస్తున్నప్పుడు అవే మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం ఎందుకివ్వరని కొన్ని పార్టీల నేతలు వాదిస్తున్నారు.

అదే సమయంలో ఇక్కడి గిరిజనులు, దళితులకు కూడా సీఏఏ వ్యతిరేకమని చెబుతున్నారు కొందరు నేతలు. అక్షరాస్యత తక్కువగా వున్న వర్గాల వద్ద వారి జనన ధృవీకరణ పత్రాలు వుండవని, అలాంటి వారికి పౌరసత్వం తిరస్కరిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్పీఆర్‌కు ఎలాంటి ధృవీకరణ పత్రాలు అవసరం లేదని కేంద్రం వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇవే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, దేశ ప్రజల్లో అపోహలను సృష్టిస్తూ గందరగోళం కల్పిస్తున్న పార్టీలకు గట్టి దెబ్బ కొట్టేలా యాక్షన్ ప్లాన్‌ని రూపొందించిన అధికార బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా సీఏఏ సానుకూల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ దేశప్రజలకు క్లారిటీ ఇచ్చేలా కొన్ని కీలకాంశాలను శుక్రవారం నాటి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రం ఏం చేయబోతోందన్న అంశం కేబినెట్ భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.