Uniform Civil Code: ఉమ్మడి పౌర స్మృతికి మద్ధతు తెలిపిన మరో విపక్ష పార్టీ
ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం తదితర అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ కూడా ఒకే చట్టం వర్తించేలా చేసే ఈ ప్రతిపాదన హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం తదితర అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ కూడా ఒకే చట్టం వర్తించేలా చేసే ఈ ప్రతిపాదన హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని సమస్యలను పక్క దారి పట్టించేందుకే ప్రధాని మోదీ దీన్ని తీసుకొస్తున్నారని విమర్శిస్తున్నాయి. కానీ మరికొన్ని విపక్ష పార్టీలు మాత్రం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను సమర్థిస్తున్నాయి. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని సమర్థిస్తూనే అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి కేంద్రం ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలని కోరింది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన కూడా మద్ధతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తమ పార్టీ విధానం యూసీసీకి అనుకూలంగా ఉందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. కానీ దీనికి సంబంధించిన ముసాయిదా వచ్చిన తర్వాతే తమ తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఈ యూసీసీ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టినప్పటికీ తమ పార్టీ మద్ధతు ఉంటుందని మరో నేత ఆనంద్ దూబే పేర్కొన్నారు. ఇటీవల వేరువేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి పౌర స్మృతి విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ఓటు బ్యాంకు కోసం రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా యూసీసీ బిల్లును పరిగణలోకి తీసుకోవాలని కోరిందని.. అలాగే రాజ్యాంగం సైతం సమాన హక్కుల గురించే చెబుతోందని పేర్కొన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం
