‘జీఎస్టీ’కి రెండేళ్లు పూర్తి..!

ఇప్పటి వరకూ జీఎస్టీ విధానాన్ని అమలు పరిచి రెండేళ్లు పూర్తయ్యాయి. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు జరపనున్న కేంద్ర ప్రభుత్వం. నేడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో జరగనున్న సంబరాలు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు. అన్ని రకాల పన్నులకు కలిసి ఒకే పన్ను విలీనం చేసేలా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తీసుకొచ్చింది కేంద్రం. 122వ రాజ్యంగ సవరణ బిల్లు కింద 2016 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి […]

'జీఎస్టీ'కి రెండేళ్లు పూర్తి..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2019 | 11:25 AM

ఇప్పటి వరకూ జీఎస్టీ విధానాన్ని అమలు పరిచి రెండేళ్లు పూర్తయ్యాయి. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు జరపనున్న కేంద్ర ప్రభుత్వం. నేడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో జరగనున్న సంబరాలు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు.

అన్ని రకాల పన్నులకు కలిసి ఒకే పన్ను విలీనం చేసేలా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తీసుకొచ్చింది కేంద్రం. 122వ రాజ్యంగ సవరణ బిల్లు కింద 2016 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీని తీసుకొచ్చారు.

పెట్రోలియం ఉత్పత్తులు, సహజవాయువులను జీఎస్టీలో చేర్చాలన్న ఆయా సంస్థల అభ్యర్థనలను కేంద్రం తిరస్కరించింది. ఇది రాష్ట్రాల పరిధిలోనిదని, రాష్ట్ర ప్రభుత్వాలే దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని కేంద్రం చెబుతూ వచ్చింది. వివాదాస్పదమైన జీఎస్టీ ఇప్పటికి దేశంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యాపార వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అప్పట్లో.. జీఎస్టీని ప్రతిపక్షాలు సహా ప్రజలు కూడా పూర్తిగా వ్యతిరేకించారు. అనంతరం దశలవారీగా.. అది అమలవుతూ వచ్చింది.