AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికొన్ని రోజుల్లో పెళ్లి.. బాత్రూమ్‌లో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?

ఆ యువతికి 23 ఏళ్లు. మరికొన్ని రోజుల్లో పెళ్లి.. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. ఫ్యామిలీ అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. కానీ ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది. ఒకేసారి అక్కాచెల్లెళ్లను ఆ పరిస్థితిలో చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మరికొన్ని రోజుల్లో పెళ్లి.. బాత్రూమ్‌లో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?
Two Sisters Dies Due To Gas Geyser Leak
Krishna S
|

Updated on: Oct 25, 2025 | 1:17 PM

Share

కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెరియపట్నంలో నూతనంగా అద్దె ఇంట్లోకి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గీజర్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. జోనిగేరి కాలనీలో నివాసం ఉంటున్న అల్తాఫ్ పాషా కుటుంబంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను గుల్ఫామ్ తాజ్ (23), ఆమె సోదరి సిమ్రాన్ తాజ్ (20) గుర్తించారు. గుల్ఫామ్ తాజ్‌కు ఇటీవల ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో ఫ్యామిలీ అంతా బిజీగా ఉంది.

గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు సిస్టర్స్ స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లారు. గీజర్‌ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ వెలువడింది. ఇది పీల్చడంతో శ్వాస ఆడక  సిస్టర్స్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు. ఎంతసేపటికీ కూతుళ్లు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు తెరిచి చూడగా.. అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించినట్లుగా డాక్టర్లు వెల్లడించారు. పెళ్లి సమయంలోనే ఇద్దరు కూతుళ్లు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

ప్రమాదానికి కారణం ఇదే

మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. గీజర్ నుంచి లీకైన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్లే ఈ యువతులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న మంత్రి వెంకటేష్ మృతుల కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.ఈ ఘటనపై పెరియపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గ్యాస్ గీజర్లు ఉపయోగించేటప్పుడు తగినంత వెంటిలేషన్ ఉండాలని, గీజర్‌ను కిటికీ లేదా సరైన గాలి మార్గం ఉన్న చోట ఉంచాలని వైద్యులు సూచించారు. కార్బన్ మోనాక్సైడ్ వాసన లేని వాయువు కాబట్టి లీకైన విషయం తెలియక ప్రమాదం జరుగుతుందని వారు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..