AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baramulla Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. లస్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ హతం.. భద్రతా బలగాలకు భారీ విజయం

Baramulla Encounter: జమ్మూకశ్మీర్‌లో రోజు ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదులను హతం చేస్తున్నారు భారత జవాన్లు. ఉగ్రవాదుల కోసం ప్రతి ..

Baramulla Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. లస్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ హతం.. భద్రతా బలగాలకు భారీ విజయం
Subhash Goud
|

Updated on: Apr 21, 2022 | 3:41 PM

Share

Baramulla Encounter: జమ్మూకశ్మీర్‌లో రోజు ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదులను హతం చేస్తున్నారు భారత జవాన్లు. ఉగ్రవాదుల కోసం ప్రతి రోజు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. బారాముల్లాలో గురువారం జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ (Encounter)లో ఇద్దరు లస్కర్‌ తోయిబా ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన జమ్మూ (Jammu) ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎంతో కాలంగా తప్పించుకుంటున్న ఉగ్రవాది మహ్మద్‌ యూసఫ్‌ కాంత్రూతో సహా ఇద్దరు టాప్‌ లస్కర్‌ తోయిబా కమాండ్లను కాల్చి చంపారు. ఇటీవల బుద్గామ్‌ జిల్లాలో జమ్మూ అండ్‌ కశ్మీర్‌ పోలీసు ఎస్‌పీవో, అతని సోదరుడు, ఒక ఆర్మీ జవాను, ఒక పౌరుడిని చంపిన ఘటనలో మహ్మద్‌ యూసఫ్‌ కీలక బాధ్యుడని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ తెలిపారు.

ఉగ్రవాద సంస్థలో కీలకంగా ఉన్న ఇద్దరిని చంపడం పెద్ద విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మరి కొంత మంది ఉగ్రవాదులు దాగి ఉండే అవకాశం ఉందని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని అన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని మాల్వా ప్రాంతంలో వారి ఉనికి గురించి ఇంటెలిజెన్సీ సమాచారం అందించిన తర్వాత భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో వారిని హతమార్చినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది 38వ ఆపరేషన్‌ అని, కశ్మీర్‌ లోయలో ఇప్పటి వరకు 53 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు ఆయన వెల్లడించారు.

అలాగే ఇప్పటి వరకు 27 మంది ఉగ్రవాదులను, 169 మంది ఉగ్రవాదులకు సంబంధించిన సహచరులను కూడా అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద టాప్ కమాండర్ యూసఫ్ కంత్రూను హతమార్చడం భద్రతా బలగాలకు పెద్ద విజయం అని జమ్ముకాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అన్నారు. కాంత్రూ గతంలో పౌరులు, భద్రతా సిబ్బంది హత్యలలో పాల్గొన్నాడని.. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్‌ డబ్బుల విషయంలో కంపెనీ చుట్టు తిరుగుతున్నారా? ఆ పని మీరే చేసుకోవచ్చు.. ఎలాగంటే!

AP News: భూ అక్రమ కేసులో తహసీల్దార్‌ను శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..!