జమ్మూ కాశ్మీర్ లో పోలీసు అధికారి కాల్చివేత ఘటనలో జైషే మహ్మద్ మిలిటెంట్లు !

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫయాజ్ అహ్మద్ అనే స్పెషల్ పోలీసు అధికారిని, ఆయన భార్యను, కూతురిని కూడా కాల్చి చంపిన వారిలో ఇద్దరు జైషే మిలిటెంట్లు ఉన్నారని కాశ్మీర్ ఐజీపీ విజయ కుమార్ తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ లో పోలీసు అధికారి కాల్చివేత ఘటనలో జైషే మహ్మద్ మిలిటెంట్లు !
Jaish Mohammad Militant
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 28, 2021 | 4:32 PM

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫయాజ్ అహ్మద్ అనే స్పెషల్ పోలీసు అధికారిని, ఆయన భార్యను, కూతురిని కూడా కాల్చి చంపిన వారిలో ఇద్దరు జైషే మిలిటెంట్లు ఉన్నారని కాశ్మీర్ ఐజీపీ విజయ కుమార్ తెలిపారు. ఫయాజ్ పై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా ఆయనను రక్షించేందుకు ఆయన భార్య, కూతురు కూడా ఉన్నారని దాంతో వారిపై కూడా టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఆయన వెల్లడించారు. కాల్పులకు పాల్పడినవారిలో ఓ విదేశీయుడు కూడా ఉన్నట్టు తెలుస్తోందన్నారు. కాగా ఈ పోలీసు అధికారి కుటుంబంపై జరిగిన దాడిని పలువురు తీవ్రంగా ఖండించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ..ఇంకా పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ గని లోనే తదితరులు ఫయాజ్ అహ్మద్ కుటుంబ సభ్యుల మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు.

ఇది మిలిటెంట్ల పిరికి చర్య అని, హింసతో దేన్నీ సాధించలేరని వీరు అన్నారు. అటు జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నేతలను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. తమ భద్రతను నిర్లక్ష్యం చేసిన ఈ పార్టీ కౌన్సిలర్లు, ఇతర నేతలను వారు కాల్చి చంపుతున్నారు. ఇలా ఉండగా జమ్మూలో డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులు హింసకు దిగుతున్నారు. నిన్న డ్రోన్ల ద్వారా వీరు జరిపిన ‘దాడి’లో ఇద్దరు భారత వైమానిక దళ ఉద్యోగులు గాయపడిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చూడండి: అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్ కి పంజాబ్ ప్రభుత్వ తిరస్కృతి… నిర్వహించి తీరుతామంటున్న ఆప్ నేతలు…

IND vs SL: శిఖర్ ధావన్ సారథ్యంలో శ్రీలంక బయలుదేరిన టీమిండియా