AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్ కి పంజాబ్ ప్రభుత్వ తిరస్కృతి… నిర్వహించి తీరుతామంటున్న ఆప్ నేతలు…

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు పంజాబ్ లో నిర్వహించదలచిన ప్రెస్ మీట్ కి ఆ రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పింది. దీన్ని నిర్వహించేందుకు అనుమతించబోమని పేర్కొంది.

అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్ కి పంజాబ్ ప్రభుత్వ తిరస్కృతి... నిర్వహించి తీరుతామంటున్న ఆప్ నేతలు...
Delhi CM Arvind Kejriwal
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 28, 2021 | 4:27 PM

Share

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు పంజాబ్ లో నిర్వహించదలచిన ప్రెస్ మీట్ కి ఆ రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పింది. దీన్ని నిర్వహించేందుకు అనుమతించబోమని పేర్కొంది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఆప్ నేతలు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేజ్రీవాల్ పంజాబ్ భవన్ లో జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా పాగా వేసేందుకు కేజ్రీవాల్ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ స్టేట్ లో తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ నిస్తామని ఆయన హామీనిచ్చారు. ధరల పెరుగుదల కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. మా ఢిల్లీ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తున్నామని, అలాగే ఇక్కడ కూడా ఇస్తామని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి సిక్కుల నుంచే ఉంటారని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ఆయన దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో మీకు తెలియజేస్తామని చెప్పారు. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 సీట్లను గెలుచుకోవడం ద్వారా ఆప్ ఇతర రాష్ట్రాల్లోనూ తమ సత్తా చూపడానికి తహతహలాడుతోంది. పంజాబ్ లోని ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసుగెత్తి పోయారని, వారు మార్పును కోరుకుంటున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Sweden Prime Minister: స్వీడన్ పార్లమెంట్‌లో విశ్వాసం కోల్పోయిన ప్రధాని.. తన పదవికి రాజీనామా

Actress Kasturi: రజినీ కాంత్ అమెరికా టూర్ పై నటి కస్తూరి సంచలన కామెంట్స్.. క్లారిటీ కావాలంటూ..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి