AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Collectors: ఔను ఆ కలెక్టర్లిద్దరూ ఇష్టపడ్డారు.. రెండోసారి పెళ్లి పీటలెక్కనున్నారు

వారిద్దరు వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు. దేశంలోనే అత్యుత్తమ సర్వీసుగా పేరున్న ఇండియన్ ఆడ్మినిస్ట్రేషన్ సర్వీసులో భాగమై.. జిల్లా పాలనాధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు పెళ్లిళ్లు చేసుకోవటం కొత్తేం కాదు.

Collectors: ఔను ఆ కలెక్టర్లిద్దరూ ఇష్టపడ్డారు.. రెండోసారి పెళ్లి పీటలెక్కనున్నారు
Marriage
Aravind B
|

Updated on: May 07, 2023 | 7:46 PM

Share

వారిద్దరు వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు. దేశంలోనే అత్యుత్తమ సర్వీసుగా పేరున్న ఇండియన్ ఆడ్మినిస్ట్రేషన్ సర్వీసులో భాగమై.. జిల్లా పాలనాధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు పెళ్లిళ్లు చేసుకోవటం కొత్తేం కాదు. ఈ ఇద్దరు కలెక్టర్ల పెళ్లి మాత్రం అరుదైన వ్యవహారంగా చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని పూరీ కలెక్టర్ గా ఉన్న సమర్థవర్మ.. రాయగడ కలెక్టర్‌ స్వాధాదేవ్ సింగ్ మే 15న వారణాసిలో పెళ్లి చేసుకోనున్నారు. విచిత్రం ఏంటంటే వీళ్లిద్దరికి కూడా ఇది రెండో వివాహం. గతంలో ఈ ఇద్దరు కలెక్టర్లు వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు.

అయితే తమ భాగస్వాములతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్న స్వాధా దేవ్ సింగ్, సమర్థ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో వీరిద్దరూ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ పెళ్లికి పూరీకి చెందిన కొంతమంది సేవాయత్‌లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. స్వాధా దేవ్ సింగ్‌తో విడాకులు తీసుకున్న బొలంగీర్ కలెక్టర్‌ చంచల్ రాణా.. మే 2న మరో కలెక్టర్ అనన్యా దాస్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అస్సాంలో గువాహటిలో వీరి వివాహం జరిగింది. కలెక్టర్ల వరుస పెళ్లిళ్లు ఒడిశాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?