AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు.. భయంతో ఇంటి నుంచి పరుగులు తీసిన ప్రజలు

ప్రకృతికి ఎప్పుడు కోపం వస్తుందో.. ఆ ప్రకోపంలో ఎంతటి విధ్వంసం కలుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మొన్న ఢిల్లీ.. ఇవాళ నికోబార్ దీవులు.. చోట్ల భూమి కంపించింది. నేపాల్‌లో 4.1భూకంప తీవ్రత నమోదయ్యింది. ఎన్‌సీఆర్‌ పరిధిలో కూడా భూమి కంపించింది.

Earthquake: నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు.. భయంతో ఇంటి నుంచి పరుగులు తీసిన ప్రజలు
Earthquake In Nicobar Island
Sanjay Kasula
|

Updated on: Apr 09, 2023 | 5:41 PM

Share

వరుస భూ ప్రకంపనాలతో వనికిపోతోంది నికోబార్ దీవులు. ఆదివారం మధ్యాహ్నం 2:59 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లుగా ఎలాంటి సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం 10 కి.మీ లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలో అంటే, ఏప్రిల్ 6 న, అండమాన్, నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రాత్రి 10:47 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది.

ఉత్తర భారతదేశంలో గత నెలలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అంతకుముందు మార్చి నెలలో ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశం అంతటా చాలా నిమిషాల పాటు బలమైన ప్రకంపనలు వచ్చాయి.

ఉత్తర ఆఫ్ఘన్‌లోని బదక్షన్‌ ప్రావిన్స్‌కు సమీపంలోని హిందూకుష్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది. దాదాపు 30 సెకన్ల పాటు భయంకరమైన వణుకు అనుభవించినట్లు జనం ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం