AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Alert: దగ్గు సిరప్ తాగిన 2 ఏళ్ల చిన్నారి గుండె ఆగిపోయింది! అసలేం జరిగిందంటే..

తాను నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులను సూచించలేదని చెప్పారు. చాలా సందర్భాలలో దగ్గు సిరప్ అవసరం లేదని డాక్టర్ తెలిపారు. ఉదాహరణకు, ముక్కు కారటం, దగ్గును వెచ్చని కంప్రెస్తో చికిత్స చేయవచ్చని చెప్పారు.

Health Alert: దగ్గు సిరప్ తాగిన 2 ఏళ్ల చిన్నారి గుండె ఆగిపోయింది! అసలేం జరిగిందంటే..
Cough Syrup
Jyothi Gadda
|

Updated on: Dec 20, 2022 | 8:22 PM

Share

కోరింత దగ్గు అనేది సాధారణంగా పిల్లలను ప్రభావితం చేసే ఒక సాధారణ అనారోగ్య పరిస్థితి. మారుతున్న వాతావరణం వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతారు. దీనివల్ల వారికి జలుబు, దగ్గు వస్తుంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది మొదట దగ్గు సిరప్ వాడతారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైనదని మీకు తెలుసా? అలాంటి ఒక దగ్గు సిరప్ తాగిన 30 నెలల పాప గుండె ఆగిపోయిన షాకింగ్ సంఘటన ముంబైలో వెలుగు చూసింది. ఔషధం తీసుకున్న 20 నిమిషాల తర్వాత చిన్నారి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబైకి చెందిన పెయిన్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ డా. దిలు మంగేష్కర్ రెండున్నరేళ్ల మనవడు డిసెంబర్ 15న దగ్గు, జలుబుతో బాధపడ్డాడు. దాంతో అతని తల్లి చిన్నారికి ఒక బహుళజాతి కంపెనీకి చెందిన దగ్గు మందు ఇచ్చింది. అయితే మందు ఇచ్చిన 20 నిమిషాల తర్వాత చిన్నారి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత అతని గుండె చప్పుడు ఆగిపోయింది. దీంతో పాటు చిన్నారి ఊపిరి పీల్చుకోలేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆ శిశువుకు పల్స్ లేదు.

దాంతో ఆ చిన్నారి తల్లి వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ బిడ్డకు హుటాహుటినా CPR అందించబడింది. ఆ తర్వాత పాప కళ్లు తెరిచి రక్తపోటు, గుండె వేగం పెరగడానికి దాదాపు 20 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై చిన్నారి తల్లి మాట్లాడుతూ.. ఘటన జరిగిన తర్వాత పలురకాల టెస్టులు చేశారు. ఇందుకు కారణం దగ్గుకు వాడిన మందు తప్ప మరే కారణం కనిపించలేదని వైద్యులు చెప్పారు. ఈ డ్రగ్‌లో క్లోర్‌ఫెనిరమైన్‌, డెక్స్‌ట్రోమెథార్ఫాన్‌ సమ్మేళనాలు ఉన్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని , నాలుగేళ్లలోపు ఈ మందులను పిల్లలకు ఇవ్వకుండా ఎఫ్‌డీఏ నిషేధించిందని తెలిపారు . అయితే, ఈ ఔషధానికి అలాంటి లేబుల్ లేదు. వైద్యులు దీనిని వారి రోగులకు సూచిస్తారు. మరోవైపు దగ్గు సిరప్ కార్డియాక్ అరెస్ట్‌కు కారణమైందని నిరూపించడం అంత సులభం కాదంటున్నారు వైద్యులు.

ఈ ఘటనపై సీనియర్ పీడియాట్రిక్ నిపుణుడు వ్యాఖ్యానిస్తూ, పిల్లల మూర్ఛకు, దగ్గు మందు మోతాదుకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడం అంత సులభం కాదని అన్నారు. మహారాష్ట్రలోని చిల్డ్రన్స్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా ఉన్న డాక్టర్ విజయ్ యెవాలే మాట్లాడుతూ, తాను నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులను సూచించలేదని చెప్పారు. చాలా సందర్భాలలో దగ్గు సిరప్ అవసరం లేదని డాక్టర్ తెలిపారు. ఉదాహరణకు, ముక్కు కారటం, దగ్గును వెచ్చని కంప్రెస్తో చికిత్స చేయవచ్చు. కొన్ని దగ్గు సిరప్‌లకు గుండె సమస్యలతో సంబంధం ఉన్నట్లు కొత్త ఆధారాలు కనుగొనబడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి