భారత నిబంధనలపై ట్విటర్ ఫైర్, పోలీసుల చేత దాడులు చేయించి బెదిరిస్తారా అంటూ మండిపాటు
భారత ప్రభుత్వం జారీ చేసిన కొత్త డిజిటల్ నిబంధనలపై ట్విటర్ మొదటిసారిగా స్పందించింది. 'కాంగ్రెస్ టూల్ కిట్' వ్యవహారంలో ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని, పోలీసుల చేత బెదిరించే ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించింది.
భారత ప్రభుత్వం జారీ చేసిన కొత్త డిజిటల్ నిబంధనలపై ట్విటర్ మొదటిసారిగా స్పందించింది. ‘కాంగ్రెస్ టూల్ కిట్’ వ్యవహారంలో ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని, పోలీసుల చేత బెదిరించే ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించింది. భావ ప్రకటనా స్వేఛ్చకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం పప్రకారం తాము నడుచుకుంటామని అంటూనే తీవ్ర పదజాలంతో ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘ఫ్రీ ఓపెన్ కన్సర్వేషన్’ కు అనువుగా రూల్స్ ని మార్చాలని కోరుతున్నామని, ఇందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని ట్విటర్ పేర్కొంది. ఇండియాలో ట్విటర్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఆఫీసర్లను నియమించాలని, వారి చిరునామాలు తెలియజేయాలని, అభ్యంతరకర కంటెంట్ తొలగింపునకు మెకానిజం ఉండాలని..ఇలా పలు నిబంధనలను ప్రభుత్వం విధించిన అనంతరం దీనిపై ఈ సంస్థ ప్రతినిధి ఒకరు ఘాటుగా స్పందించారు. (కాగా ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవిగా ఉండడమే గాక.., యూజర్ల ప్రైవసీని ఉల్లంఘించేవిగా ఉన్నాయని వాట్సాప్ అప్పుడే ప్రభుత్వానికి చురకలు వేసింది). ఇండియాలోని తమ సంస్థ ఉద్యోగుల విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని ట్విటర్ ప్రతినిధి తెలిపారు. ఈ పాండమిక్ సమయంలో ప్రజలకు అండగా ఉంటామని, భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటామని…. కానీ ఇదే సమయంలో ప్రైవసీని, భావ ప్రకటనా స్వేచ్చను దృష్టిలో ఉంచుకుని ప్రతి వాణిని వినిపించగోరుతున్నామని ఆయన చెప్పారు.
‘కాంగ్రెస్ టూల్ కిట్’ వ్యవహారంలో ఈ పార్టీకి, బీజేపీకి మధ్య జరిగిన ట్విటర్ వార్ నేపథ్యంలో.. తన ట్యాగ్ ను ట్విటర్ తొలగించాలని బీజేపీ ప్రభుత్వం కోరడం, ఢిల్లీ, గుర్ గావ్ లలోని ఈ సంస్థ కార్యాలయాలపై ఇటీవల పోలీసులు దాడులు జరపడం తెలిసిందే. సంజాయిషీ ఇవ్వాలంటూ పోలీసులు ఈ సంస్థ ఉద్యోగులకు నోటీసులు కూడా అందజేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Karthika Deepam: దమ్ము కొడుతూ కనపడిన వంటలక్క.. నెట్టింట వైరల్… ( వీడియో )
Viral Video: యువకుడు చేసిన వినూత్న ప్రయత్నంతో ఫిదా అయిన నెటిజన్లు… ( వీడియో )