TV9 WITT Summit: మా ప్రభుత్వంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య.. టీవీ9 సమ్మిట్‌ లో సీఎం కేజ్రీవాల్‌

టీవీ9 నిర్వహించిన సత్తా సమ్మేళన్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్ హయాంలో ఆప్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాడ్డాక దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోయాయన్నారు.

TV9 WITT Summit: మా ప్రభుత్వంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య.. టీవీ9 సమ్మిట్‌ లో సీఎం కేజ్రీవాల్‌
CM Arvind Kejriwal
Follow us
Basha Shek

|

Updated on: Feb 28, 2024 | 10:58 AM

టీవీ9 నిర్వహించిన సత్తా సమ్మేళన్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్ హయాంలో ఆప్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోయాయన్నారు. సర్కారు స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దామన్నారు. ‘ఇప్పుడు మేం 11, 12వ తరగతి విద్యార్థులకు వ్యాపార రంగంలోని మెలకువలు బోధిస్తున్నాం. అలాగే మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నాం. ఇలా చేయడం వల్ల భవిష్యత్ లో వారు ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదుగుతారు’ అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇదే సమావేశంలో బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వం ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పలు సార్లు ప్రయత్నించిందన్నారు. అయితే తాము గట్టిగా నిలబడ్డామని, ప్రజలందరూ తమ వైపే ఉన్నారన్నారు. తాము ఎలాంటి తప్పులు చేయనుందుకే జనాలు మాకు అండగా నిలిచారని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఇంకేం మాట్లాడారో ఈ కింది వీడియోలో చూడొచ్చు.