WITT: దేశ హితాన్ని కోరుకునే పార్టీని ఎన్నుకోండి.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్ షా పిలుపు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 400కిపైగా సీట్లతో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని అతిమ్ షా ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో భారత్ పురోగమించింది అని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని అమిత్ షా అన్నారు...
టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 400కిపైగా సీట్లతో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని అతిమ్ షా ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో భారత్ పురోగమించింది అని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని అమిత్ షా అన్నారు. ఇక దేశ హితాన్ని కోరుకునే పార్టీనీ ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ సంక్షేమాన్ని కోరని అవినీతి, కులతత్వం, బంధుప్రీతి పార్టీలను ఎన్నుకోవద్దని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీ అమ్మే వ్యక్తి కొడుకు కూడా దేశానికి ప్రధాని కాగల పార్టీని ఎంచుకోండని పిలుపునిచ్చారు.
వైరల్ వీడియోలు
Latest Videos