AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 WITT Summit 2024: పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు మహిళలు పడే బాధల గురించి ఎవరు చెబుతారు..? స్మృతి ఇరానీ ఏమన్నారంటే

TV9 What India Thinks Today: ప్రధాని మోదీ హయాంలో మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలక పాత్ర పోషిస్తుందన్నారు . గతంలో ఎన్నడు లేని విధంగా మహిళల కోసం కేంద్రం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందంటూ స్మృతి ఇరానీ వివరించారు. దేశంలోని నంబర్-1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 'వాట్ ఇండియా టుడే' గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు సోమవారం 'మహిళా శక్తి - అభివృద్ధి చెందిన భారతదేశం' అనే అంశంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడారు.

TV9 WITT Summit 2024: పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు మహిళలు పడే బాధల గురించి ఎవరు చెబుతారు..? స్మృతి ఇరానీ ఏమన్నారంటే
Smriti Irani
Shaik Madar Saheb
|

Updated on: Feb 26, 2024 | 3:16 PM

Share

ప్రధాని మోదీ హయాంలో మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలక పాత్ర పోషిస్తుందన్నారు . గతంలో ఎన్నడు లేని విధంగా మహిళల కోసం కేంద్రం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందంటూ స్మృతి ఇరానీ వివరించారు. దేశంలోని నంబర్-1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ‘వాట్ ఇండియా టుడే’ గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు సోమవారం ‘మహిళా శక్తి – అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే అంశంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత స్వాతంత్య్రంలో మహిళా శక్తి కూడా కీలక పాత్ర పోషించిందని అన్నారు. రాణి లక్ష్మీబాయి పోరాటాన్ని ఉదాహరణగా పేర్కొంటూ.. ఆమె తన కొడుకును వీపుపై కట్టుకుని బ్రిటిష్ వారిపై ఎలా పోరాడిందో చెప్పారు. ఈ సంరద్భంగా లింగ సమానత్వంపై ఇరానీ మాట్లాడుతూ.. పిల్లలు పుట్టే సమయంలో మహిళలు పడే బాధను ఎవరు చెబుతారంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మహిళల కోసం అనేక చర్యలు తీసుకుందని.. అది 6 నెలల ప్రసూతి సెలవులు కావచ్చు లేదా ఇటీవల ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు.. ఇలాంటి ప్రయాణం ప్రత్యేకమైనది. మహిళలు చాలామందికి రోల్ మోడల్ అంటూ పేర్కొన్నారు.

నేటి మహిళలు పురుషులతో భుజం భుజం కలిపి నడుస్తున్నారని స్మృతి ఇరానీ అన్నారు. మహిళల బలానికి ప్రధాని మోదీ భిన్నమైన గుర్తింపు ఇచ్చారన్నారు. ఆర్థిక వ్యవస్థలో మహిళలను సమాన భాగస్వాములను చేశారన్నారు. 90 మిలియన్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానమయ్యారని.. నేడు భారతదేశంలోని మహిళలు ఎవరికీ తక్కువ కాదంటూ పేర్కొన్నారు.

రాణి లక్ష్మీబాయి గురించి ఏమన్నారంటే..

మహిళా శక్తి గురించి స్మృతి ఇరానీ మాట్లాడుతూ రాణి లక్ష్మీబాయి గురించి ప్రస్తావించారు. స్వాతంత్య్ర పోరాటంలో రాణి లక్ష్మీబాయి బ్రిటీష్‌వారిని ఎలా దెబ్బతీశారో వివరించారు. తన కొడుకును వీపున కట్టుకుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. స్వాతంత్య్ర సమరంలో ప్రపంచంలో ఏ దేశంలోనైనా మహిళ ఇలా పోరాడి ఉంటుందా? అందుకే ప్రధాని మోదీ ‘అభివృద్ధితో పాటు వారసత్వం’ గురించి మాట్లాడుతున్నారన్నారు.

లింగ సమానత్వంపై మాట్లాడిన ఇరానీ, తాము మహిళల సమస్యలను మాత్రమే హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఇతర పురుషుల కోసం వారు ఏమి చేశారని మేము ఎప్పుడూ పురుషులను అడగము. ఆడవాళ్లు ఏదైనా చేస్తే మీరు ఇన్‌స్పిరేషన్ అని అంటారు.. ఒక మగవాడు కూడా ఇంకొందరు మగవాడికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాడు. మేము తమ లింగ భారాన్ని మాత్రమే మోస్తాము.. అంటూ వివరించారు.

మహిళల కృషిని గుర్తించాలి..

మహిళల అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని ఇరానీ అన్నారు. మహిళలు ఇంట్లో పని చేస్తారు. తల్లి, భార్య ఇలా మహిళలంతా ఇంట్లో పని చేస్తారు.. వారి పనికి గుర్తింపు లేదు. మహిళలు తమ బిడ్డను 9 నెలల పాటు కడుపులో ఉంచుకుంటారు. పిల్లలు పుట్టే సమయంలో మహిళలు పడే బాధల విలువ ఎవరు చెబుతారు? అంటూ పేర్కొన్నారు.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..