Highway Heroes campaign: నేటి నుంచి బెంగళూరులో ‘హైవే హీరోస్’ క్యాంపెయిన్
"హైవే హీరోస్" (Highway Heroes) అనేది దేశంలోని ట్రక్ డ్రైవర్లను అభినందించే, వారికి సహాయం చేసే ఒక కార్యక్రమం. TV9 నెట్‌వర్క్, శ్రీరామ్ ఫైనాన్స్ సంయుక్తంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా, ట్రక్ డ్రైవర్లకు ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు, డబ్బు ఆదా చేయడానికి ఆర్థిక సలహాలు ఇస్తారు. ఈ క్యాంపెయిన్ మే 2 నుంచి బెంగళూరులో జరుగుతుంది.

శ్రీరామ్ ఫైనాన్స్, టీవీ9 నెట్‌వర్క్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘హైవే హీరోస్’ క్యాంపెయిన్ మే 2 నుండి కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభం అయింది. మే 2, 3 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి యశ్వంత్‌పూర్‌లోని ఇండస్ట్రియల్ సబర్బ్‌లోని దేవరాజ్ ఉర్స్ ట్రక్ టెర్మినల్ వేదిక అయింది.
ఈ క్యాంపెయిన్ ట్రక్ డ్రైవర్లను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ప్రభావవంతులు చేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ‘హైవే హీరోస్’ ప్రచారంలో పాల్గొనేవారు వారి టెక్నికల్ స్కిల్స్ పెంపొందించడానికి ఉద్దేశించిన ‘లెవల్ 4 ట్రైనింగ్ సర్టిఫికేట్’ను కూడా అందుకుంటారు.
‘హైవే హీరోస్’ క్యాంపెయిన్ ముఖ్యాంశాలు
మానసిక ఆరోగ్యం: ‘ది యోగా ఇన్స్టిట్యూట్’ నిపుణులచే యోగా సెషన్లు నిర్వహిస్తారు. యోగాసనాల ద్వారా స్ట్రస్‌ను ఎలా డీల్ చేయాలి, మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి అంశాలపై ఫోకస్ ఉంటుంది.
శారీరక ఆరోగ్యం: ‘పిరమల్ స్వాస్థ్య’ నిపుణులు క్షయవ్యాధి అవగాహన సెషన్లను నిర్వహిస్తారు. దీని ద్వారా డ్రైవర్లకు క్షయవ్యాధి, దాని నివారించే మార్గాలపై అవగాహన కల్పిస్తారు.
ఆర్థిక అక్షరాస్యత: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిపుణులు బడ్జెట్, పొదుపు, సైబర్ మోసాల నుంచి రక్షణ అనే అంశాలపై డ్రైవర్లకు పూర్తి అవగాహన కల్పిస్తారు.
స్కిల్ ఇండియా శిక్షణ: ప్రభుత్వం గుర్తింపు పొందిన శిక్షణతో పాటు “12వ ప్లస్ వాల్యూ” సర్టిఫికేట్ ఉన్న డ్రైవర్లకు అవార్డు కూడా అందించబడుతుంది. ఈ సర్టిఫికేషన్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం డ్రైవర్లకు సహాయపడుతుంది. ఇది 90 కంటే ఎక్కువ దేశాలలో చెల్లుబాటు అవుతుంది.
ట్రక్ డ్రైవర్ల జీవితాల్లో వివిధ కోణాలలో సానుకూల మార్పులు తీసుకురావడమే ఈ క్యాంపెయిన్‌లో ముఖ్య ఉద్దేశం. ‘హైవే హీరోస్’ రాబోయే కార్యక్రమాలు చెన్నైలో మే 6–7 తేదీల్లో… విజయవాడలో మే 9–10 తేదీలలో జరుగుతాయి.
అందరు ట్రక్ డ్రైవర్లు ఈ ప్రచారానికి హాజరై వారి శారీరక, మానసిక, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




