AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attari–Wagah border: అటారీ-వాఘా స‌రిహ‌ద్దు పూర్తిగా బంద్‌.. నిలిచిన భారత్‌-పాక్‌ మధ్య రాకపోకలు!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఒకటైన భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉన్న అటారీ-వాఘా స‌రిహ‌ద్దు పూర్తిగా మూసివేయబడింది. దీంతో ఇరు దేశాల మధ్య రాకపోకలు ఇక ముగిసిపోయాయి. భారత్‌లో ఉన్న పాక్‌ దేశస్తులు వెళ్లిపోవడాని ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో భారత్ ఈ సరిహద్దు ప్రాంతాన్ని మూసివేసింది. దీంతో గ‌డిచిన ఏడు రోజుల్లో 911 మంది పాకిస్తానీలు భారత్‌ను వీడగా, 15 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది.

Attari–Wagah border: అటారీ-వాఘా స‌రిహ‌ద్దు పూర్తిగా బంద్‌.. నిలిచిన భారత్‌-పాక్‌ మధ్య రాకపోకలు!
Attari Wagah Border
Anand T
|

Updated on: May 02, 2025 | 9:55 AM

Share

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్‌ భారత దేశాన్ని కలిచి వేసింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత్‌-పాక్ మధ్య దౌత్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. భారత్‌ నుంచి పాక్‌ వెళ్లే సింధూ జలాలను నిలిపివేసింది. దీంతో పాటు భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అటారీ-వాఘా సరిహద్దును పూర్తిగా మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. భారత్‌లో ఉన్న పాకిస్థాన్‌ దేశస్తులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు తిరిగి దేశానికి రావాలని తెలిపింది. దీంతో గత వారం రోజులుగా ఈ బోర్డర్ గుండా రెండు దేశాల‌ ప్రజలు రాకపోకలు సాగించారు. భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు వెళ్లిపోవడం, పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు ఇండియాకు రావడం జరిగింది. అయితే వివిధ వీసాలపై భారత్‌లో ఉన్న పాకిస్థాన్‌ దేశస్థులు భారత్‌ వదిలి వెళ్లేందుకు విధించిన గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. ఈ క్రమంలోనే అటారీ-వాఘా స‌రిహ‌ద్దును భారత్‌ ప్రభుత్వం పూర్తిగా క్లోజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై దౌత్యపరమైన, ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనిలో భాగంగా అటారీ-వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను మూసివేశారు. ఇకపై ఇరుదేశాల ప్రజ‌లు రాక‌పోక‌లు సాగించేందుకు వీలులేదని అధికారులు తెలిపారు.  దీంతో గ‌డిచిన ఏడు రోజుల్లో భారత్‌లో ఉన్న 911 మంది పాకిస్తానీలు తిరిగి వాళ్ల దేశానికి వెళ్లిపోగా.. పాకిస్థాన్‌లో ఉన్న  15 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే అటారీ సరిహద్దు భారత్-పాకిస్తాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గం. దీని మూసివేత వల్ల రెండు దేశాల మధ్య ప్రయాణం, వాణిజ్యం, సీమాంతర కదలికలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు దేశాల పౌరుల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ మూసివేత ఎప్పటివరకు కొనసాగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒక్కో పరుగుకు రూ. 5 లక్షలు.. షాకిస్తోన్న CSK బుడ్డోడి లెక్కలు
ఒక్కో పరుగుకు రూ. 5 లక్షలు.. షాకిస్తోన్న CSK బుడ్డోడి లెక్కలు
నౌతపా అంటే ఏమిటి? ఎండలు మండిపోయే ఈ 9 రోజులు సరిగ్గా ఉండకపోతే
నౌతపా అంటే ఏమిటి? ఎండలు మండిపోయే ఈ 9 రోజులు సరిగ్గా ఉండకపోతే
మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా.. జేబుకు చిల్లు పడకముందే ఈ విషయాలు..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా.. జేబుకు చిల్లు పడకముందే ఈ విషయాలు..
ఈ క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా 172 లీటర్ల పెట్రోల్..!
ఈ క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా 172 లీటర్ల పెట్రోల్..!
అనస్థీషియా లేని కాలంలో ఆపరేషన్లు ఎలా చేసేవారో తెలుసా? వింటేనే భయం
అనస్థీషియా లేని కాలంలో ఆపరేషన్లు ఎలా చేసేవారో తెలుసా? వింటేనే భయం
మీరు అరటి తొక్క తీసే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది!
మీరు అరటి తొక్క తీసే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుంది!
రాజస్థాన్ @ 205.. పంజాబ్, కోల్‌కతాలకు షాక్ ఇచ్చిందిగా..!
రాజస్థాన్ @ 205.. పంజాబ్, కోల్‌కతాలకు షాక్ ఇచ్చిందిగా..!
జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వ
జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వ
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?