Earthquake: అర్ధరాత్రి భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు.. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.3 నమోదు

Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. భూకంపాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు..

Earthquake: అర్ధరాత్రి భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు.. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.3 నమోదు
Earthquake
Follow us

|

Updated on: May 24, 2021 | 7:16 AM

Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. భూకంపాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లో అర్ధరాత్రి భూకంపం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ ప్రాంతం కేంద్రంగా అర్ధరాత్రి ఒంట గంట ప్రాంతంలో భూమి కంపించింది. చమోలీ జిల్లాతో పాటు డెహ్రాడూన్, పౌరి, గర్హాల్ జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. 22 కిలోమీటర్ల లోతులో నుంచి సంభవించిన భూ ప్రకంపనల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. భారీగా శబ్దం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో జనాలు గాఢ నిద్రలో ఉండగా, ఒక్కసారిగా భారీగా శబ్ధాలు వినిపించడంతో భయాందోళనకు గురయ్యారు.

ఇవీ చదవండి:

Cheetahs: 74 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా నుంచి భారత అడవుల్లో అడుగుపెట్టనున్న చిరుతలు.. ప్రభుత్వం ఏర్పాట్లు

LPG Gas: షాకింగ్‌ న్యూస్‌.. ఈనెల 29 నుంచి తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్‌ హోమ్‌ డెలివరీ నిలిపివేత.. ఎందుకంటే..!