దేశంలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు…….రైలు టికెట్ల రిజర్వేషన్ శాతం ఎంతగా పెరిగిందంటే ….?
దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో రైల్వే శాఖ పంట పండింది. ప్రజలు ఇక రైలు ప్రయాణాలపై ఉత్సాహం చూపుతున్నారు. ట్రెయిన్ టికెట్ల రిజర్వేషన్ శాతం అమాంతంగా పెరిగిపోయింది. ఇది సుమారు
దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో రైల్వే శాఖ పంట పండింది. ప్రజలు ఇక రైలు ప్రయాణాలపై ఉత్సాహం చూపుతున్నారు. ట్రెయిన్ టికెట్ల రిజర్వేషన్ శాతం అమాంతంగా పెరిగిపోయింది. ఇది సుమారు 230 శాతం పెరిగిందని భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. గత మే 15 న తమ సీట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య మొత్తం 6.3 లక్షలు కాగా..జూన్ 7 నాటికి ఇది 14.6 లక్షలకు పెరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే రెండు నెలలకు గాను డిమాండ్ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నామని రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సునీత్ శర్మ తెలిపారు. వెయింటింగ్ లిస్ట్ పరిస్థితిని బట్టి ‘క్లోన్’ ట్రెయిన్ సర్వీసును నిర్వహించడం ద్వారా డిమాండును తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రయాణికుల సంఖ్య ఇబ్బడి ముబ్బడి కావచ్చునని ఆశిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో నేషనల్ ట్రాన్స్ పోర్దర్ రైళ్ల సంఖ్యను ఇంకా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ప్ప్రత్యేకంగా ఈ సంస్థ 889 స్పెషల్ మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను, 479 ప్యాసింజర్ రైళ్లను, 26 క్లోన్ ట్రెయిన్స్ ను నడుపుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవి గాక 2,891 సబర్బన్ సర్వీసులను కూడా నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.
అటు- జులై నుంచి పండుగలు, పబ్బాల సీజన్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో రైలు ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగి రైల్వే శాఖ ఆదాయం గణనీయంగా పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు ఇక కళకళలాడనున్నాయి.పైగా దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది ఆరు కొత్త సెక్షన్ల విద్యుదీకరణ (ఎలెక్ట్రిఫికేషన్) ప్రక్రియను కూడా చేపట్టనుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల మూడు రోజులుగా.తంటాలు పడుతున్న పిల్ల కోతి..వైరల్ అవుతున్న వీడియో :Monkey Viral Video.