AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa: గోవా వెళ్తున్నారా..? ఈ విషయం తెలుసుకోకపోతే మీకు ఫైన్ పడ్డట్లే

అవును.. అందరూ ఎంజాయ్ చేయడానికే గోవా వెళ్తారు. కానీ కొంచెం అయినా బాధ్యత ఉండాలి కదా... తాగి సీసాలు ఎక్కడపడితే అక్కడ విసరడం కరెక్టేనా..? ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ చేస్తే మిగిలినవారికి ఇబ్బంది కాదా..? ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లే.. అందుకే కలంగుట్‌ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది.

Goa: గోవా వెళ్తున్నారా..? ఈ విషయం తెలుసుకోకపోతే మీకు ఫైన్ పడ్డట్లే
Calangute Beach
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2024 | 1:11 PM

Share

గోవా అంటేనే ఓ ఎమోషన్.. ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా గోవా ట్రిప్‌కి వెళ్లి.. అక్కడ ప్రకృతి అందాలను తిలకిస్తుంటే ఆ కిక్కే వేరు. బీచ్‌లు, చర్చ్‌లు, జలపాతాలు, ఫారెస్ట్‌లు.. ఆహా గోవా హెవెన్ అంతే. ఇక గోవాలో కలంగుట్‌ బీచ్‌ చాలా ఫేమస్. గోవా వెళ్లినవారు కచ్చితంగా ఈ బీచ్‌కు వెళ్లి తీరతారు. అయితే అక్కడి వస్తున్న పర్యాటకులు… కలంగుట్‌ గ్రామ పరిసరాలను చెత్తచెదారంతో నింపేస్తున్నారు. అంతేకాదు ఇష్టారాజ్యంగా వాహనాలను పార్క్ చేస్తున్నారు. కొందరు లౌడ్ స్పీకర్స్‌లో పాటలు పెట్టి రోడ్లపైనే డ్యాన్సులు వేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వంట వండుకుని తినేస్తున్నారు. మద్యం తాగిన సీసాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తున్నారు. హెటళ్లలో ఉండకుండా.. బయటే ఉంటూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో టూరిస్టుల చేష్టలను కట్టడి చేసేందుకు కలంగుట్‌ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లు లేకుండా వచ్చే రోడ్‌ ప్యాసింజర్‌పై ఇకపై పన్ను విధించేందుకు నిర్ణయించింది.

జాన్ నెలలో పంచాయతీ మీటింగ్‌లో పర్యాటకుల నుంచి  అదనపు పన్ను వసూలు చేయాలని తీర్మానించారు. హోటళ్లలో ఎలాంటి రిజర్వేషన్లు చేసుకోకుండా..  గ్రామానికి వచ్చేవారికి పన్ను వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామానికి ఎంటరయ్యే ఐదు మార్గాల్లో చెక్‌పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కావాల్సిన అనుమతుల కోసం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అనుమతులు వచ్చాక.. పోలీసులతో పాటు.. పంచాయతీ సిబ్బంది కూడా ఆ చెక్ పాయింట్ల దగ్గర పహారా కాయనున్నారు. బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్న టూరిస్టులను అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచి జోసఫ్‌ సెకీరియా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన