Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: దేశంలో ఆయన ఉంటే అన్నీ సాధ్యమే.. ప్రధాని మోడీకి జగద్గురువుల ఆశీస్సులు..

శ్రీ సుత్తూరు మఠంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ప్రధాని మోదీని ప్రముఖ సాధువులు ప్రశంసించారు. ఈ మేరకు శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహా స్వామీజీ ప్రకటన విడుదలచేశారు.

PM Narendra Modi: దేశంలో ఆయన ఉంటే అన్నీ సాధ్యమే.. ప్రధాని మోడీకి జగద్గురువుల ఆశీస్సులు..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 20, 2022 | 11:20 PM

Top Saints laud PM Modi in Mysuru: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ మైసూరులోని శ్రీ సుత్తూరు మఠంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జగద్గురువులు శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజీ, సిద్దేశ్వర స్వామిజీ, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మ‌ఠంలో సాధువుల మ‌ధ్య ఉన్నందుకు గర్వంగా ఉందంటూ పేర్కొన్నారు. శ్రీ సుత్తూరు మఠం ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక అంటూ కొనియాడారు. కాగా.. శ్రీ సుత్తూరు మఠంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ప్రధాని మోదీని ప్రముఖ సాధువులు ప్రశంసించారు. ఈ మేరకు శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహా స్వామీజీ ప్రకటన విడుదలచేశారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రధాన మంత్రి.. నరేంద్ర మోడీ మాతో ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు. శతాధిక వృద్ధురాలు మాతాజీ శ్రీమతీ హీరాబెన్ పుత్రుడు మోడీ ఆధ్వర్యంలో దేశం ఎన్నడూ చూడని అపూర్వమైన అభివృద్ధిని చూసిందని.. రాజకీయాలను విప్లవాత్మకంగా మార్చారంటూ కొనియాడారు.

ప్రజా జీవితంలో సరళత, నిజాయితీతో కూడిన ఒక కొత్త అధ్యాయాన్ని మోడీ ఆవిష్కరించారని.. ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిందని శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజీ పేర్కొన్నారు. ఆయన గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. రోజుకు 18 గంటలపాటు ప్రజల కోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి నాయకుడిని ప్రపంచం చూసి ఉండకపోవచ్చంటూ అభిప్రాయపడ్డారు. సామాజిక, ఆర్థిక రంగాలలో అద్భుత సమాచారాన్ని అందించిన నాయకత్వ లక్షణాల కోసం నేడు ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందన్నారు. మోడీ ఉంటే అన్నీ సాధ్యమేనంటూ పేర్కొన్నారు.

కలలో కూడా ఊహించని నిర్ణయాలు.. 

ఇవి కూడా చదవండి

మోడీ నాయకత్వంలో మరే ఇతర దేశం చర్యలు తీసుకోని విధంగా భారత్ కరోనా సమయంలో చర్యలు తీసుకుందన్నారు. లాక్డౌన్, కరోనావైరస్ నిర్వహణ, టీకా సరఫరాలో భారతదేశం ప్రజాస్వామ్య దేశాలలో తిరుగులేని దేశంగా మారిందన్నారు. రాజకీయ, ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించారన్నారు. కశ్మీర్, రామమందిర సమస్యలు వంటి సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి. ఇది కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. భారతదేశం బలం ఇప్పుడే ప్రపంచానికి తెలిసిందన్నారు. భారతీయ సమాజంలోని ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకుంటున్నారన్నారు.

అలాంటి గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ మూడవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒకసారి… ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు తమ మఠాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభూమి కోసం ఏదైనా చేయడానికి ప్రధానమంత్రే ప్రేరణ అన్నారు. దేశం పట్ల ప్రేమ, కర్తవ్యం, లక్ష్యాన్ని చూపించి.. ప్రపంచ మానవీయ విలువలను మోడీ తిరగరాశారన్నారు. మోదీజీ వల్ల మనందరం చూడాలనుకున్న మార్పు ఇదేనంటూ పేర్కొన్నారు. రాబోయే కాలం కూడా అతని నాయకత్వంలో ఉండాలని కోరుకుంటున్నామని శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజీ పేర్కొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న అధికారిక నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించింది ప్రధాని మోడీ అంటూ కొనియాడారు. దేవుడు అతనికి అపారమైన శక్తిని, దేశ సేవ కోసం నిరంతర శక్తిని అందించాలని ప్రార్ధించారు.

ప్రధాని మోదీ నిండునూరేళ్లు జీవించాలి.. శ్రీ సిద్దేశ్వర స్వామీజీ

సుత్తూరు మఠంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ.. సిద్ధేశ్వర స్వామిజీ రచించిన మూడు పుస్తకాలను విడుదలచేశారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధేశ్వర స్వామిజీ మాట్లాడుతూ.. పీఎం మోడీ జననాయకుడు అంటూ కొనియాడారు. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ప్రేమించే ప్రధాని మోడీ లాంటి ప్రధాని.. భారతదేశానికి ఉండటం దైవానుగ్రహమని చెప్పారు. ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సంతోషంగా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తుండటం ఆయన నాయకత్వ లక్షణాలకు నిదర్శనమన్నారు. యోగా పుస్తకాలను యోగి లాంటి ప్రధాని మోదీ విడుదల చేయడం గర్వకారణం అన్నారు. ప్రధాని నిండూ నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. చివరగా, సిద్ధేశ్వర స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజంతా కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి, అలాగే నవ్వుతూ జీవించాలని ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..