Most Wanted Terrorist: ఉగ్ర ఏరివేతపై భద్రతాదళాల ఫోకస్.. ఎన్కౌంటర్లో చిక్కిన ఎల్ఈటీ కమాండర్
జమ్ముకశ్మీర్లో ఉగ్ర ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల పౌరులపై ఉగ్ర దాడుల అనంతరం భారీ ఆపరేషన్ చేపట్టాయి భద్రతాదళాలు. ఈ స్పెషల్ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 11మంది ముష్కరులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లో ఉగ్ర ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల పౌరులపై ఉగ్ర దాడుల అనంతరం భారీ ఆపరేషన్ చేపట్టాయి భద్రతాదళాలు. ఈ స్పెషల్ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 11మంది ముష్కరులు హతమయ్యారు. మొత్తం 8ఎన్కౌంటర్లలో 11మందిని మట్టుబెట్టారు. ఐతే పాంపోర్ ఎన్కౌంటర్లో ఎల్ఈటీ కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖాందే చిక్కినట్లు వెల్లడించాయి భద్రతాదళాలు. జమ్ముకశ్మీర్ పోలీసుల టాప్-10 వాంటెడ్ జాబితాలో ముస్తాక్ ఉన్నట్లు తెలిపారు. బాఘాట్ శ్రీనగర్‌లో ఇద్దరు పోలీసులను హతమార్చడం సహా..పలు ఉగ్రదాడుల్లో ముస్తాక్ పాల్గొన్నట్టు వెల్లడించారు.
పౌరులపై ఉగ్ర దాడులతో..తాము ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు పోలీసులు. పౌరుల రక్షణ తమ బాధ్యతని..అందుకే వరుస ఆపరేషన్లతో ముష్కరులను ఏరివేసినట్టు తెలిపారు. తప్పించుకున్న వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: Crocodile: 13 అడుగుల భారీ మొసలిని పట్టుకున్న వేటగాడు.. కడుపులో 5 వేల ఏళ్లనాటి బాణం..