India Covid-19: గుడ్‌న్యూస్.. తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. దేశవ్యాప్తంగా నిన్న ఎన్నంటే..?

India Corona Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు

India Covid-19: గుడ్‌న్యూస్.. తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. దేశవ్యాప్తంగా నిన్న ఎన్నంటే..?
India Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 16, 2021 | 10:06 AM

India Corona Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయమేంటంటే.. ఇటీవల కేసుల సంఖ్య 20వేలకు దిగువన నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,981 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రెండూ తగ్గాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న నిమోదైన కరోనా కేసులు, మరణాల్లో కేరళలో 8867 కేసులు నమోదు కాగా.. 67 మంది మరణించారు.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,53,573 కి పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య 4,51,980 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 17,861 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,33,99,961 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,01,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా దేశంలో రికవరీ రేటు భారీగా పెరిగుతోంది. మార్చి తర్వాత రికవరీ రేటు 98 శాతానికి పైగా పెరగింది.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 97,23,77,045 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న దేశవ్యాప్తంగా 8,36,118 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 9,23,003 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో అక్టోబర్ 15 వరకు 58,98,35,258 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

Durga idol immersion: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. నమజ్జనం చేస్తుండగా ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి..

Sabarimala Ayyappa Temple: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. నేడు తెరుచుకోనున్న ఆలయం.. కానీ..