టిస్ నోటిఫికేషన్ విడుదల… 50 కోర్సులకు ఒకే పరీక్ష… అప్లై చేయడానికి ఆఖరు తేదీ జనవరి 15

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) సోషల్ వర్క్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సహా 50 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేసింది.

టిస్ నోటిఫికేషన్ విడుదల... 50 కోర్సులకు ఒకే పరీక్ష... అప్లై చేయడానికి ఆఖరు తేదీ జనవరి 15

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) సోషల్ వర్క్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సహా 50 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సంస్థ ముంబై క్యాంపస్‌లో 32, హైదరాబాద్ క్యాంపస్‌లో 6, గువాహటి క్యాంపస్‌లో 8, తుల్జాపూర్ క్యాంపస్‌లో4 కోర్సులను అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు చదువుతున్న డిగ్రీ కోర్సుల్లో చదువుతున్న సబ్జెక్టులకు ఈ పీజీ కోర్సుకు సంబంధం అవసరం లేదు. సాధారణ డిగ్రీతో పీజీ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. ప్రశ్నలన్నీ జనరల్ విభాగానికి చెందినవే ఉంటాయి. కోర్సుల వ్యవధి రెండు నుంచి మూడు సంవత్సరాలు ఉంటాయి. పీజీ పూర్తి చేసిన అనంతరం ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంహెచ్ఏ, ఎంపీహెచ్ డిగ్రీలను ప్రదానం చేస్తారు.

ఎంపిక విధానం…

అభ్యర్థులు ఎవరైనా టిస్ నెట్ రాయాలి. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా స్టేజ్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ స్టేజీలో ఆప్టిట్యూడ్, ఇంటర్వ్యూ విధానంలో పరీక్ష ఉంటుంది. మొదటి నెట్, స్టేజ్ 2 వెయిటేజీలను ఆధారంగా ఎంపిక జరుగుతుంది. టిస్ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. వంద నిమిషాల టైం ఉంటుంది.

మరింత సమాచారం…

ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ జనవరి 15
పరీక్ష తేదీ ఫిబ్రవరి 20
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు… హైదరాబాద్, విశాఖపట్నం

 

Click on your DTH Provider to Add TV9 Telugu