కనీస మద్దతుధరపై కొత్త చట్టాల ప్రభావం ఉండదు, చర్చలకు రండి, రైతులకు కేంద్రం ఆహ్వానం

కనీస మద్దతుధర (ఎం ఎస్ పీ) పై కొత్త చట్టాల ప్రభావం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. తాము ఎలాంటి 'ఇగో'లకు పోవడంలేదని, అరమరికలు లేకుండా రైతులతో చర్చలకు సిధ్దమని..

కనీస మద్దతుధరపై కొత్త చట్టాల ప్రభావం ఉండదు, చర్చలకు రండి, రైతులకు కేంద్రం ఆహ్వానం
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 10, 2020 | 6:46 PM

కనీస మద్దతుధర (ఎం ఎస్ పీ) పై కొత్త చట్టాల ప్రభావం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. తాము ఎలాంటి ‘ఇగో’లకు పోవడంలేదని, అరమరికలు లేకుండా రైతులతో చర్చలకు సిధ్దమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. కనీస మద్దతుధరపై కొత్త బిల్లు తేవాలని కేంద్రం యోచిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన, ఈ చట్టాలకు, ఎం ఎస్ పీకి అసలు సంబంధమే లేదని చెప్పారు. తాము పంపిన ప్రతిపాదనలను రైతు సంఘాలు పరిశీలించి చర్చలకు రావాలని, సంప్రదింపులకు తాము ఎప్పుడూ రెడియేనని తోమర్ అన్నారు. కనీస మద్దతుధర కొనసాగుతుందని స్పష్టంగా లిఖితపూర్వకంగా వారికి హామీ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

‘మండి’ శృంఖలాల నుంచి అన్నదాతలను విముక్తం చేయాలనుకుంటున్నామని, దానివల్ల వారు తమ పంట ఉత్పత్తులను ఎక్కడైనా, ఎవరికైనా, తమకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చునని తోమర్ చెప్పారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోనిదని, కేంద్రానికి దానితో సంబంధం లేదని కొన్ని రైతు సంఘాలు చర్చల సందర్భంగా తమ దృష్టికి తెచ్చాయని, అయితే ట్రేడ్ పై (వ్యాపార లావాదేవీలపై) చట్టం చేసే అధికారం కేంద్రానికి ఉందని వారికి తెలిపామని ఆయన అన్నారు. ఏపీ ఎం సీ, ఎం ఎస్ పీలపై ప్రభావం ఉండదని మరీమరీ చెప్పామన్నారు.

మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రైతుల భూములను పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకుంటారనడం కేవలం అపోహే అని వ్యాఖ్యానించారు.  స్వామినాథన్ కమిషన్ నివేదిక గురించి కూడా తోమర్ ప్రస్తావించారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!