Biryani: బిర్యానీ తిన్నారు.. చికెట్ వంటకాలు లాగించారు.. ఇంటికి వెళ్లారు.. కట్ చేస్తే..

బిర్యానీతోపాటు చికెట్ వంటకాలు ఇక్కడ తినేందుకు తెగ ఇష్టపడుతుంటారు. ఇదే వారిపాలిట శాపంగా మారింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి..

Biryani: బిర్యానీ తిన్నారు.. చికెట్ వంటకాలు లాగించారు.. ఇంటికి వెళ్లారు.. కట్ చేస్తే..
Tamil Chicken Biryani
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 12, 2021 | 9:01 AM

వీకెండ్ వచ్చిందంటే చాలా అక్కడివారంతా అక్కడ వాలిపోతారు. అక్కడ లభించే చికెన్ బిర్యానీ అంటే అక్కడివారికి తెగ ఇష్టం.. అందకే ఆ బిర్యానీ సెంటర్ చాలా ఫేమస్. స్థానికులు చాలా మంది వారి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లి కావలసిన బిర్యానీ లాగిస్తుంటారు. బిర్యానీతోపాటు చికెట్ వంటకాలు ఇక్కడ తినేందుకు తెగ ఇష్టపడుతుంటారు. ఇదే వారిపాలిట శాపంగా మారింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అతని భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి బస్ స్టాండ్ సమీపంలోని ఆ హోటల్ కు వెళ్లి బిర్యానీలు, చికెన్ కబాబ్ లు, తందూరి చికెన్, పరోటాలు తిన్నారు. హోటల్ లో సంతోషంగా ఎంకావాలో అవి తిన్న తరువాత కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. వీరితో పాటు ఆరోజు చాలా మంది ఆ హొటల్ లో బిర్యానీలు, పరోటాలు, చికెన్ కబాబులు, చిల్లీ చికెన్ ఇలా వారికి ఏమి ఇష్టమో ఆ వంటలు తిన్నారు. ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు తరువాత వాంతులు చేసుకోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లో వెళ్లితే.. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అరణిలో ఉన్న సెవన్ స్టార్ బిర్యానీ హోటల్ చాలా ఫేమస్. కోవిడ్‌తో కొద్ది రోజులపాటు మూత పడి ఈ మధ్య తెరుచుకుంది. దీంతో స్థానికులు ఆ హోటల్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు.  కొందరు అక్కడే తినగా.. మరికొందరు అక్కడి నుంచి పార్సల్ తీసుకెళ్లారు. అయితే అక్కడే తిన్నవారు ఇప్పుడు ఆస్పత్రి బెడ్స్‌పై చికిత్స పొందుతున్నారు.

వీరితో పాటు ఆరోజు చాలా మంది ఆ హొటల్ లో బిర్యానీలు, పరోటాలు, చికెన్ కబాబులు, చిల్లీ చికెన్ ఇలా వారికి ఏమి ఇష్టమో ఆ వంటలు తిన్నారు. ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు తరువాత వాంతులు చేసుకోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 10 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. పరిస్థితి విషమంగా మారడంతో బాలిక తల్లిదండ్రులు, ఆమె సోదరుడిని ఆసుపత్రిలో ఐసీయూకి తరలించారు.

ఇదే హోటల్ లో బిర్యానీలు తిన్న సుమారు 40 మంది వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ఆ హోటల్ కు క్లోజ్ చేశారు. హోటల్ యజమానితో పాటు వంట మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫేమస్ బిర్యానీ హోటల్ లో ఫుడ్ తిన్న చాలా మంది ఇప్పుడు ఆసుపత్రికి క్యూ కట్టడం కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి: Chirutha: అనుకున్నట్లుగానే చిక్కింది.. ఫారెస్ట్ అధికారుల ప్లాన్ ఫలించింది.. బోన్‌లో పడిన చిరుతను..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే