అతివేగంతో అదుపు తప్పిన ట్రక్కు.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని బలితీసుకుంది.. డ్రైవర్‌ పరార్

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను గుర్తిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితుడి గాలిస్తున్నట్టుగా చెప్పారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

అతివేగంతో అదుపు తప్పిన ట్రక్కు.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని బలితీసుకుంది.. డ్రైవర్‌ పరార్
Shastri Park Road Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2024 | 12:32 PM

దేశరాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌ పై నిద్రిస్తున్న వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో డివైడర్‌పై నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపుతప్పి ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు జగ్ ప్రవేశ్ చంద్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రి పార్క్‌ సమీపంలో సోమవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 4:56 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సీలంపూర్ నుండి వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి ఫుట్‌పాత్ డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటన అనంతరం డ్రైవర్‌ ట్రక్కును అక్కడే వదిలేసి పరారైనట్టుగా పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ట్రక్కు ఢీకొని ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జైనట్లు గుర్తించారు. వెంటనే అందరినీ ఆసుపత్రికి తరలించగా, ముగ్గురు మృతి చెందారు.

ఈ వీడియో చూడండి..

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను గుర్తిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితుడి గాలిస్తున్నట్టుగా చెప్పారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అతడిని అతి త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..