బీకేర్‌ఫుల్.. అమెజాన్ పార్సిల్‌లో ఇలాంటివి కూడా వస్తుంటాయ్..! బాక్స్ ఓపెన్ చేస్తుండగానే వింత శబ్ధాలు..
ఓ జంట ఆన్‌లైన్ షాపింగ్ చేశారు. ఆర్డర్ ఇంటికి వచ్చింది. అయితే, కొన్ని సార్లు ఆర్డర్లు తప్పుగా వస్తున్నాయని భావించి బాక్స్ను విప్పే క్రమంలో మొబైల్ ఫోన్ తో వీడియో తీయడం ప్రారంభించారు. ఆ బాక్స్ ను ఓపెన్ చేసే క్రమంలోనే అందులోంచి బుస్ బుస్ మంటూ ఏవో వింత శబ్ధాలు రావడం గమనించారు. దాంతో వారు అలర్ట్ అయ్యారు. వీడియోను మరింత జూమ్ చేసి తీశారు. వేగంగా మీదకు దూసుకొస్తున్న
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అసలే వర్షాకాలం కావటంతో తరచూ పాములు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజల్ని భయపెడుతున్నాయి. అనుకోకుండా ఇళ్లలోకి ప్రవేశించిన పాములు, వాటిని బంధించేందుకు స్నేక్ క్యాచర్స్ చాకచక్యంగా వ్యవహరించే తీరుకు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే, చాలామంది స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవటంలో తమకున్న టాలెంట్‌ను ప్రపంచానికి చూపించేందుకు ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇక వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం వల్ల వారు కూడా బాగా ఫేమస్ అవుతున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఒక పాముకు సంబంధించిన ఓ వింత సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అసలే వర్షాకాలం కావటంతో తరచూ పాములు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజల్ని భయపెడుతున్నాయి. అలాగే, కొన్ని కొన్ని సందర్భాల్లో పాములు ఇంట్లోని ఫ్రిడ్జ్, బాత్రూం, మంచం, సోఫాలు, వేసుకునే బట్టల్లోనూ దూరుతుంటాయి. అలాగే, ఇప్పుడు ఆన్‌లోన్ షాపింగ్ చేసిన ఆర్డర్ బాక్సుల్లోనూ దూరిపోతున్నాయి పాములు. అవును మీరు విన్నది నిజమే.. ఇటీవల అమెజాన్ లో షాపింగ్ చేసిన ఓ జంటకు ఇలాంటిదే ఒక వింత అనుభవం ఎదురయింది. అమెజాన్ నుంచి వచ్చిన ఆర్డర్‌లో పాము కనిపించింది. అది చూసి ఇంట్లో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అమెజాన్ లో ఇలా పాములు కూడా పంపుతున్నారా అంటూ ఆశ్చర్యంతో పాటు ఒక్కింత ఆందోళనకు గురయ్యారు.
In a shocking incident, a family on Sarjapur Road received a live Spectacled Cobra with their Amazon order for an Xbox controller.
The venomous snake was fortunately stuck to packaging tape, preventing harm.#ITReel #Sarjapur #AmazonOrder #SnakeInAmazonOrder pic.twitter.com/EClaQrt1B6
— Prakash (@Prakash20202021) June 19, 2024
ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ అనేది ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారింది. ప్రజలు తమకు అవసరమైన ఏ వస్తువు కావాలన్నా కూడా ఇంట్లో ఉండి ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ పూర్తి చేస్తున్నారు. ఏ వస్తువులు కొనాలనుకున్న ఈజీగా ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో ఆర్డర్ చేసి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇటీవల అమెజాన్ లో షాపింగ్ చేసిన ఓ జంటకు వింత అనుభవం ఎదురయింది. కర్ణాటక – సర్జాపూర్ పట్టణానికి చెందిన జంట ఆన్‌లైన్ షాపింగ్ చేశారు. ఆర్డర్ ఇంటికి వచ్చింది. అయితే, కొన్ని సార్లు ఆర్డర్లు తప్పుగా వస్తున్నాయని భావించి బాక్స్ను విప్పే క్రమంలో మొబైల్ ఫోన్ తో వీడియో తీయడం ప్రారంభించారు. ఆ బాక్స్ ను ఓపెన్ చేసే క్రమంలోనే అందులోంచి బుస్ బుస్ మంటూ ఏవో వింత శబ్ధాలు రావడం గమనించారు. దాంతో వారు అలర్ట్ అయ్యారు. వీడియోను మరింత జూమ్ చేసి తీశారు. వేగంగా మీదకు దూసుకొస్తున్న పామును బయటకు రాకుండా వెంటనే వారు టేపుతో బాక్స్ను మరీ గట్టిగా అతికించారు. ఈ పూర్తి సంఘటనకు సంబంధించిన వీడియోను వారు అమెజాన్ కు ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో వేగంగా వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..