AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంట్రెస్టింగ్‌ వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. చూస్తే కచ్చితంగా ట్రై చేస్తారు

ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను నెటిజన్లతో షేర్‌ చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్‌ మహీంద్ర పోస్ట్‌ చేసిన ఓ వీడియో మనల్ని చిన్నతనంలోకి తీసుకెళ్లడం ఖాయం. పేపర్‌తో ప్లేన్‌ను తయారు చేయడం మనందరికీ తెలిసిదే. మనలో ప్రతీ ఒక్కరం చిన్న తనంలో ఇలా ఆడుకునే ఉంటాం. ప్రస్తుతం అయితే రీల్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌...

Viral Video: ఇంట్రెస్టింగ్‌ వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. చూస్తే కచ్చితంగా ట్రై చేస్తారు
Anand Mahindra
Narender Vaitla
|

Updated on: Aug 26, 2024 | 8:40 AM

Share

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దేశం గర్వించే పారిశ్రామికవేత్తగానే కాకుండా, సోషల్‌ మీడియా ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు ఆనంద్‌ మహీంద్ర. సోషల్‌ మీడియాలో ఏ వీడియో ట్రెండింగ్‌లో ఉన్నా వెంటనే తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తారు.

ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను నెటిజన్లతో షేర్‌ చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్‌ మహీంద్ర పోస్ట్‌ చేసిన ఓ వీడియో మనల్ని చిన్నతనంలోకి తీసుకెళ్లడం ఖాయం. పేపర్‌తో ప్లేన్‌ను తయారు చేయడం మనందరికీ తెలిసిదే. మనలో ప్రతీ ఒక్కరం చిన్న తనంలో ఇలా ఆడుకునే ఉంటాం. ప్రస్తుతం అయితే రీల్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌ అంటూ చిన్నారులు ఫోన్‌లతో కుస్తీ పడుతున్నారు కానీ.. ఒకప్పుడు మాత్రం చిన్నారులు ఇలాంటి ఆటలే ఆడుకునే వారు.

ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన వీడియోలో పేపర్‌ ప్లేన్‌ను ఎలా రూపొందించాలో సవివరంగా తెలిపారు. గాల్లో రయ్యిమని దూసుకుపోతున్న ఈ పేపర్‌ ప్లేన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రం.. ‘పిల్లలకు ఇంకా ఇలాంటి వాటిమీద ఆసక్తి ఉందో లేదో తెలియదు, కానీ నా స్కూల్‌ రోజుల్లో చాలా దూరం ప్రయాణించే పేపర్‌ ప్లేన్‌ని డిజైన్‌ చేయాలనే ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో నేను ఈ డిజైన్‌ని చూసి ఉంటే… పోటీలో తేలికగా గెలిచి ఉండేవాడిని’ అని రాసుకొచ్చారు.

వైరల్ వీడియో..

దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. చిన్న తనంలో పేపర్‌ ప్లేన్స్‌ తయారు చేసి ఎగరవేసిన రోజులను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఈ వీడియో తమను చిన్నతనంలోకి తీసుకెళ్లిందని ఓ యూజర్‌ కామెంట్‌ చేస్తే. మరికొందరు ఈ తరం చిన్నారులకు ఇలాంటివి నేర్పించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే