Viral: రన్నింగ్ బైక్‌పై చిన్నారి.. డ్రైవర్ లేకుండానే ప్రయాణం. చూస్తే షాకే..
పిల్లలు దేవుడితో సమానం అంటారు.. ఈ వీడియో చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. బిజీ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ బైక్‌పై నుంచి కింద పడిపోతే.. అదే బైక్‌పై ఉన్న చిన్నారి మాత్రం ఎవరో పట్టుకున్నట్లు బైక్‌పై అలాగే కూర్చుండిపోయింది. ఇక బైక్ కూడా ఎవరో నడుపుతున్నట్లు ఏమాత్రం అదుపు తప్పకుండా ఎవరూ డ్రైవ్ చేయకుండానే రోడ్డుపై ఇతర ఏ వాహనాలను ఢీ కొట్టకుండా చాలా దూరం వెళ్లింది.
పిల్లలు దేవుడితో సమానం అంటారు.. ఈ వీడియో చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. బిజీ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ బైక్‌పై నుంచి కింద పడిపోతే.. అదే బైక్‌పై ఉన్న చిన్నారి మాత్రం ఎవరో పట్టుకున్నట్లు బైక్‌పై అలాగే కూర్చుండిపోయింది. ఇక బైక్ కూడా ఎవరో నడుపుతున్నట్లు ఏమాత్రం అదుపు తప్పకుండా ఎవరూ డ్రైవ్ చేయకుండానే రోడ్డుపై ఇతర ఏ వాహనాలను ఢీ కొట్టకుండా చాలా దూరం వెళ్లింది. అలా వెళ్లిన బైక్ రోడ్డు పక్కన ఉన్న పొదను ఢీ కొట్టడంతో చిన్నారి సురక్షితంగా ఫుట్‌పాత్ గడ్డిపై పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బిజీ రోడ్డుపై భార్య బిడ్డలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు ఓ వ్యక్తి. అదే రోడ్డుపై ఇతర వాహనాలు కూడా యమ స్పీడ్‌లో వెళ్తుంటాయి. ఇంతలో బైకుకు అనుకోని ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న మరో బైకును బలంగా ఢీ కొట్టడంతో.. దానిపై కూర్చున్న దంపతులు ఇద్దరూ కింద పడిపోయారు. కానీ బైక్‌పై కూర్చున్న చిన్నారి మాత్రం బైక్‌పైనుంచి పక్కకు ఒరగను కూడా ఒరగలేదు.
అంత ప్రమాదం జరిగితే బైక్ కింద పడలేదు సరికదా.. రోడ్డుపై వెళ్తున్న ఏ వాహనాన్ని కూడా ఢీ కొట్టలేదు. అలా రోడ్డుపై నేరుగా వెళ్తున్న బైక్‌ను చూసి.. రోడ్డుపై ఇతర వాహనాల్లోని ప్రయాణికులకు గుండె ఆగినంత పనైంది. అలా ఏకంగా 500 మీటర్ల వరకు వెళ్లిన బైక్ రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదలకు ఢీ కొనడంతో చిన్నారి గడ్డిపై పడింది. వెంటనే స్థానికులు కొందరు పరుగు పరుగున చిన్నారి పడిన చోటికి వెళ్లారు. గబగబా చిన్నారిని ఎత్తుకున్నారు. చిన్నారికి ఏమైందోనని ఆందోళన చెందారు. కానీ విచిత్రంగా చిన్నారికి చిన్న గాయం కూడా కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బైక్ మరో వాహనాన్ని ఢీకొట్టి ఉంటే చిన్నారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేది. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింతో తెలియదు గానీ ఇందుకు సంబంధించిన దృశ్యాలు అదే రోడ్డుపై వెళ్తున్న మరో కారులోని కెమెరాలో రికార్డయ్యాయి. ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

