ఏడాది వ్యవధిలో ముగ్గురు ఢిల్లీ మాజీ సీఎంలు మృతి

కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణం దేశం మొత్తాన్ని దిగ్భాంతికి గురిచేసింది. మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. గత ఏడాది కాలంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు మృతి చెందడంతో ఢిల్లీ బోసిపోయింది. బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా తన 82 ఏళ్ల వయసులో అక్టోబర్ 27, 218న తుదిశ్వాస విడిచారు. ఆయన ఢిల్లీకి మూడవ సీఎంగా సేవలందించారు. 1993 నుంచి 1996 వరకు ఆయన […]

ఏడాది వ్యవధిలో ముగ్గురు ఢిల్లీ మాజీ సీఎంలు మృతి
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 3:20 PM

కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణం దేశం మొత్తాన్ని దిగ్భాంతికి గురిచేసింది. మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు.

గత ఏడాది కాలంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు మృతి చెందడంతో ఢిల్లీ బోసిపోయింది. బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా తన 82 ఏళ్ల వయసులో అక్టోబర్ 27, 218న తుదిశ్వాస విడిచారు. ఆయన ఢిల్లీకి మూడవ సీఎంగా సేవలందించారు. 1993 నుంచి 1996 వరకు ఆయన సీఎంగా కొనసాగారు. ఆయన బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతూ మ‌ృతి చెందారు.

ఇక కాంగ్రెస్ సీనియర్ మహిళానేత షీలా దీక్షిత్  81 ఏళ్ల వయసులో గత నెల జూలై 20,2019లో తుదిశ్వాస విడిచారు. షీలా.. ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆమె 2004లో కేరళ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ పార్లమెంట్ స్ధానం నుంచి పోటీ చేసి షీలా గెలుపొందారు. ఆమె మరణించే సమయానికి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతూనే తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం మరో మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఇక సెలవంటూ వెళ్లిపోయారు. ఢిల్లీకి ఐదవ ముఖ్యమంత్రిగా ఆమె సేవలందించారు. మహిళల పక్షపాతిగా వారిలో అభ్యున్నతి కోసం కృషి చేసిన సుష్మా మరణంతో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఏడాది కాలంలో ముగ్గురు మాజీ సీఎంలు ప్రాణాలు కోల్పోవడం యాదృచ్ఛికమే అయినా.. వీరంతా దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రులుగా పనిచేయడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.