‘ పబ్లిక్ గా రాహుల్ పని పట్టండి.. ‘. సావర్కర్ మనుమడి డిమాండ్

  తన గ్రాండ్ ఫాదర్, హిందుత్వ నేత వీ.డీ. సావర్కర్ ను అవమానించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని బహిరంగంగా ‘ కొట్టించాలని ‘ ఆయన (సావర్కర్) మనుమడు రంజిత్ సావర్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రేను అభ్యర్థించారు. ఢిల్లీలో ఇటీవల ‘ భారత్ బచావో ‘ ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ.. తాను ‘ రాహుల్ సావర్కర్ ‘ ను కానని, వాస్తవం చెబుతున్న తాను […]

' పబ్లిక్ గా రాహుల్ పని పట్టండి.. '. సావర్కర్ మనుమడి డిమాండ్
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 16, 2019 | 6:59 PM

తన గ్రాండ్ ఫాదర్, హిందుత్వ నేత వీ.డీ. సావర్కర్ ను అవమానించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని బహిరంగంగా ‘ కొట్టించాలని ‘ ఆయన (సావర్కర్) మనుమడు రంజిత్ సావర్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రేను అభ్యర్థించారు. ఢిల్లీలో ఇటీవల ‘ భారత్ బచావో ‘ ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ.. తాను ‘ రాహుల్ సావర్కర్ ‘ ను కానని, వాస్తవం చెబుతున్న తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. (‘రేప్ ఇన్ ఇండియా ‘ అన్న తన వ్యాఖ్యలకు రాహుల్ అపాలజీ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది).

అయితే ఆ సందర్భంలో ఆయన వీ.డీ. సావర్కర్ ను అవమానించే విధంగా మాట్లాడారని రంజిత్ సావర్కర్ మండిపడ్డారు. సావర్కర్ ను ఇన్సల్ట్ చేసినవారిని బహిరంగంగా కొడతామని ఆ మధ్య ఉధ్ధవ్ థాక్రే చేసిన హెచ్చరికను రంజిత్ ఆదివారం ఆయనను కలిసిన సందర్భంలో గుర్తు చేశారు. ‘నిజానికి నాడు మా గ్రాండ్ ఫాదర్ బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పలేదు.. రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజం కావు.. మా తాతగారు కేవలం జైలు నుంచి విడుదలయ్యేందుకే బ్రిటిష్ వారి షరతులకు అంగీకరించారు తప్ప….వారికి క్షమాపణ చెప్పలేదు.. తలొగ్గలేదు కూడా ! ‘ అని రంజిత్ సావర్కర్ స్పష్టం చేశారు.