కుప్పకూలిన డైనోసార్.. పర్యాటకులకు తప్పిన ముప్పు

కుప్పకూలిన డైనోసార్.. పర్యాటకులకు తప్పిన ముప్పు

గుజరాత్‌లో ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం( స్టాట్యూ ఆఫ్ యూనిటీ) వద్ద నిర్మించిన 30 అడుగుల భారీ డైనోసార్ విగ్రహం కుప్పకూలింది. అక్కడికి వచ్చే పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించిన ఈ డైనోసార్ విగ్రహం నెలరోజుల్లోనే కుప్పకూలిపోవడంపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పటేల్ విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చపెట్టగా ఈ డైనోసార్ విగ్రహాన్ని నిర్మించేందుకు రూ.2 కోట్లు ఖర్చుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదని అధికారులు తెలిపారు. అయితే ఎంతో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 09, 2019 | 8:17 PM

గుజరాత్‌లో ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం( స్టాట్యూ ఆఫ్ యూనిటీ) వద్ద నిర్మించిన 30 అడుగుల భారీ డైనోసార్ విగ్రహం కుప్పకూలింది. అక్కడికి వచ్చే పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించిన ఈ డైనోసార్ విగ్రహం నెలరోజుల్లోనే కుప్పకూలిపోవడంపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పటేల్ విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చపెట్టగా ఈ డైనోసార్ విగ్రహాన్ని నిర్మించేందుకు రూ.2 కోట్లు ఖర్చుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదని అధికారులు తెలిపారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన పటేల్ విగ్రహం వద్దకు వచ్చే పర్యాటకుల్ని ఈ డైనోసార్ విశేషంగా ఆకర్షించింది. ప్రస్తుతం ఇది కూలిపోడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu