కేరళ రోడ్డుపై.. దట్టమైన చీకట్లో.. ఒంటరిగా చిన్నారి..

కేరళలోని ఇదుక్కి జిల్లాలో ఓ ఎస్యూవీ వాహనం అతి వేగంగా వెళ్తోంది. దట్టమైన చీకటి.. అందులోనూ నిర్మానుష్యమైన అటవీ ప్రాంతం.. ఆ వాహనంలో ఏడాది వయసున్న తమ పాపతో సహా ప్రయాణిస్తోంది ఓ జంట. ఎంతో దూరం నుంచి ప్రయాణిస్తున్నారేమో.. కారులోనే కునుకు తీశారు. అయితే తమ పాప సంగతి మరిచిపోయినట్టున్నారు. వారి చేతిలోనుంచి ఆ చిన్నారి జారి ఎలా పడిపోయిందో.. గానీ వాహనం నుంచి కింద పడిపోయింది. దాదాపు నిద్రావస్థలో ఉన్న ఆ తలిదండ్రులు ఈ […]

కేరళ రోడ్డుపై.. దట్టమైన చీకట్లో.. ఒంటరిగా చిన్నారి..
Follow us

|

Updated on: Sep 09, 2019 | 4:53 PM

కేరళలోని ఇదుక్కి జిల్లాలో ఓ ఎస్యూవీ వాహనం అతి వేగంగా వెళ్తోంది. దట్టమైన చీకటి.. అందులోనూ నిర్మానుష్యమైన అటవీ ప్రాంతం.. ఆ వాహనంలో ఏడాది వయసున్న తమ పాపతో సహా ప్రయాణిస్తోంది ఓ జంట. ఎంతో దూరం నుంచి ప్రయాణిస్తున్నారేమో.. కారులోనే కునుకు తీశారు. అయితే తమ పాప సంగతి మరిచిపోయినట్టున్నారు. వారి చేతిలోనుంచి ఆ చిన్నారి జారి ఎలా పడిపోయిందో.. గానీ వాహనం నుంచి కింద పడిపోయింది. దాదాపు నిద్రావస్థలో ఉన్న ఆ తలిదండ్రులు ఈ విషయాన్ని గమనించనే లేదు.. కారు జోరున సాగిపోయింది. కింద పడిన చిన్నారి ఏడుస్తూ .. ఆ చీకట్లో పాకుతూ కదిలింది. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అదృష్టవశాత్తూ ఆ దారి వెంట వెళ్తున్న ఓ పోలీసు కంట కనబడిందిఆ పాప.. ఆమె తాలూకు వాళ్ళెవరైనా సమీపంలోనే ఉన్నారేమో అనుకుని చుట్టుపక్కల అంతా చూసినా ఎవరూ కనిపించకపోయేసరికి, వెంటనే ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేశాడు. పాపను రక్షించాడు. చివరకు పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లకూ ఈ సమాచారాన్ని చేరవేశారు. పాప తలిదండ్రులెవరో వఛ్చి ఆమెను తీసుకువెళ్లాలని ఈ సమాచారంలో కోరారు. చాలా దూరం వెళ్ళాక నిద్రావస్థ నుంచి తేరుకున్న ఆ పసికందు తలిదండ్రులు తమ బిడ్డ కనబడకపోయేసరికి గాభరా చెందారు. ఏమైతేనేం.. అసలు విషయం తెలిసింది. పోలీసుల రక్షణలో తమ చిన్నారి సురక్షితంగా ఉందని తెలిసి సదరు పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. తమ బిడ్డను అక్కున చేర్చుకున్నారు. వాహనం నుంచి కింద పడిపోయినప్పుడు ఆ బేబీ తలపై చిన్న గాయాలు తగిలాయి తప్ప పెద్ద ప్రమాదమేమీ కాకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అన్నట్టు… ఈ ‘ నిద్రా రాక్షసులు ‘ తమిళనాడులో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి తమ స్వస్థలానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందట.