పల్లెటూరి స్టైల్లో మటన్ బోటి కూర ఇలా చేస్తే గిన్నె కూడా వదలరు!

Prasanna Yadla

18 February 2026

Pic credit - Pixabay

మటన్ బోటి కూర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనిని సరైన విధంగా చేస్తే తినడానికి రుచికరంగా ఉంటుంది. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..  

 మటన్ బోటి కూర 

ముప్పావు కిలో మటన్ బోటి, పెద్ద ఉల్లిపాయ 1, ఘాటు పచ్చిమిర్చి  4, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజ్ మూడు టమాటాలు, 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలి

కావల్సిన పదార్ధాలు

ఇంకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, 4 టేబుల్ స్పూన్స్ నూనె,  రుచికి సరిపడినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా ఆకులు, ఉడకడానికి సరిపోయే నీళ్ళు తీసుకోవాలి. 

కావల్సిన పదార్ధాలు

ముందుగా బాగా శుభ్రం బోటిని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని  కుక్కర్‌లో వేసి, రెండు గ్లాస్ లు నీరు, ఒక టీ స్పూన్ పసుపు, అర టీస్పూన్ ఉప్పు వేసి ఉడికించాలి.

స్టెప్ - 1

బోటి బాగా ఉడికే వరకు స్టవ్ మీదే ఉంచాలి.  కొంత సమయం పట్టినా పర్లేదు. బోటి ఉడికిన తర్వాత ఆ నీటిని  వంపేసి ఒక గిన్నెలో వేసుకోండి.

స్టెప్ - 2

ఇక ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో నూనె వేసి అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్  వచ్చే వరకు  బాగా వేయించాలి.

స్టెప్ - 3

 ముందుగా పక్కన పెట్టుకున్న బోటిని వేసి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 10 నిముషాలు తర్వాత కర్రీ మసాలాలు వేయాలి 

స్టెప్ - 4

గ్రేవీ కావాలనుకుంటే రెండు గ్లాస్ లు పోసి, గరం మసాలా పొడి వేసి మూతపెట్టి మీడియం మంటపై 20 నిమిషాలు స్టవ్ మీదే బాగా ఉడికించాలి.

స్టెప్ - 5

బోటి ఉడికి నూనె పైకి తేలిన తర్వాత కిందకు దించేయండి. చివర్లో  కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో తింటే ముక్క కూడా వదలకుండా లాగించేస్తారు.

వేడి వేడి మటన్ బోటి కూర రెడీ!