AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. అరుణాచలం వెళ్లి.. కారులో వస్తుండగా అర్థరాత్రి ఊహించని ఘటన..

వారంతా అరుణాచలం యాత్రకు వెళ్లారు. అక్కడ అరుణాచలేశ్వర ఆలయంలో శివుడిని దర్శించుకున్నారు. అనంతరం కారులో ఇంటికి వస్తున్నారు. అర్థరాత్రి అయ్యింది.. మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు.

అయ్యో దేవుడా.. అరుణాచలం వెళ్లి.. కారులో వస్తుండగా అర్థరాత్రి ఊహించని ఘటన..
Shadnagar Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Feb 18, 2026 | 11:08 AM

Share

వారంతా అరుణాచలం యాత్రకు వెళ్లారు. అక్కడ అరుణాచలేశ్వర ఆలయంలో శివుడిని దర్శించుకున్నారు. అనంతరం కారులో ఇంటికి వస్తున్నారు. అర్థరాత్రి అయ్యింది.. మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మంగళవారం అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాయికల్ టోల్ ప్లాజా దగ్గర గుర్తు తెలియని వాహనం ఒక ఇన్నోవా క్రిష్ట వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.

అరుణాచలం నుంచి యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి.. వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు..

మృతులిద్దరూ రంగారెడ్డి జిల్లా తుర్క యాంజాల్‌కు చెందిన పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని.. వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరికొన్ని నిమిషాల్లో ఇంటికి వస్తారనగా.. ఊహించని ఘటన జరగడం.. ఇద్దరు చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు