5

ఆ విషయంలో బెంగళూరే ఫస్ట్.. ఒక్క వారంలో రూ.72 లక్షలు వసూలు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. దిమ్మతిరిగిపోయేలా చలాన్లు రాస్తూ ఆయా రాష్ట్రాల్లో ట్రాఫిక్ పోలీసులు సైతం వార్తలకెక్కుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. పోలీసుల విధిస్తున్న జరిమానాలు కట్టలేక బైకులు అక్కడే వదిలేసి వెళ్లిపోయే వారు కొందరైతే.. అరెస్టు చేసి జైలుకు పంపండి అనేవారు మరికొందరు. ఇంకొందరు వాహనదారులైతే ఏకంకా తమ […]

ఆ విషయంలో  బెంగళూరే ఫస్ట్.. ఒక్క వారంలో రూ.72 లక్షలు వసూలు
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 9:11 PM

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. దిమ్మతిరిగిపోయేలా చలాన్లు రాస్తూ ఆయా రాష్ట్రాల్లో ట్రాఫిక్ పోలీసులు సైతం వార్తలకెక్కుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. పోలీసుల విధిస్తున్న జరిమానాలు కట్టలేక బైకులు అక్కడే వదిలేసి వెళ్లిపోయే వారు కొందరైతే.. అరెస్టు చేసి జైలుకు పంపండి అనేవారు మరికొందరు. ఇంకొందరు వాహనదారులైతే ఏకంకా తమ వాహనాలకు నిప్పు పెట్టుకుంటున్నారు. ఈ చాలాన్లు కట్టేకంటే తగలబెట్టుకోవడమే మంచిదని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే చట్టం వచ్చిన రెండురోజుల  తర్వాత కర్ణాటకలో దీన్ని అమలుచేయడం ప్రారంభించారు. బెంగళూరు సిటీలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తూ   రికార్డు సృష్టించారు. ఒక్క వారం రోజుల్లోనే  అక్షరాలా రూ. 72,49,900 వసూలు చేశారు.

ఒక్క వారం రోజుల్లో బెంగళూరు పోలీసులు రాసిన చలాన్లు మొత్తం 6,813. ముఖ్యంగా హెల్మెట్ లేని బైకులు, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, సరైన వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ ప్రయాణం చేసే కేసులు భారీగా నమోదయ్యాయి. చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నవారు ఇలా ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు.

ఇదిలా ఉంటే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం వాహనదారుల్లో అవగాహన పెంచడానికా? లేక ప్రాణాపాయం నుంచి రక్షించడానికా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వేలకు వేలు చలాన్లు రాస్తూ ప్రభుత్వం భారీ వసూళ్లకు పాల్పడుతోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.